అబ్బా తల పగిలిపోతుంది.. టీ తాగితే తగ్గిపోతుంది. అని చాలా మంది తలనొప్పి వచ్చినప్పుడల్లా కప్పులకు కప్పులు టీని లాగిస్తుంటారు. అసలు టీ నిజంగా తలనొప్పిని తగ్గిస్తుందా? పదండి ఇప్పుడు తెలుసుకుందాం..
అలసటను పోగొట్టడానికి, నిద్రమబ్బును వదిలించుకోవడానికి టీని తాగుతుంటారు. టీ తాగితే తక్షణమే ఎనర్జీ వస్తుంది. నిద్రమజ్జు చిటికెలో వదిలిపోతుంది. అందుకే రోజుకు ఐదారు సార్లైనా టీని తాగేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారికి మర్యాదగా ముందుగా టీనే ఇస్తారు. అయితే చాలా మంది టీ తాగితే తలనొప్పి కూడా తగ్గిపోతుందని నమ్ముతారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టీ తాగితే కొంతమందికి తలనొప్పి తగ్గుతుంది. కానీ టీ లో ఉండే కెఫిన్ కంటెంట్ కొంతమందికి తలనొప్పి వచ్చేలా చేస్తుంది. కరెంట్ ఒపీనియన్ ఇన్ న్యూరాలజీ లో ప్రచురించబడిన ఒక సమీక్ష ప్రకారం.. టీ లోని కెఫిన్ మీ పరిస్థితిని బట్టి మీరు విశ్రాంతి తీసుకోవడానికి, తలనొప్పిలో నొప్పి పెరిగేలా చేస్తుంది. ఈ పరిశోధన చేసిన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కెఫిన్ ను లిమిట్ లో తీసుకోవాలి. తలనొప్పిని తగ్గించుకోవడానికి మీరు టీని మందుగా వాడుతున్నట్టైతే .. దీన్ని మానేయడమే మంచిది.
undefined
అయితే తలనొప్పిని తగ్గించుకోవడానికి కెఫిన్ కంటెంట్ లేని హెర్బల్ టీ తాగొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రకమైన టీలో అల్లం టీ ఒకటి. అల్లం టీ మైగ్రేన్ నొప్పిని తొందరగా తగ్గిస్తుందని నమ్ముతారు.
అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. కెఫిన్ కంటే అల్లం రెండు గంటల్లో తలనొప్పిని తగ్గిస్తుంది. 2 గంటల్లో తలనొప్పి చాలా వరకు తగ్గిందని కనుగొన్నారు. కెఫిన్ తో పోలిస్తే అల్లం.. వికారం, వాంతులను తగ్గిస్తుందని పరిశోధకులు నమ్మారు. అల్లంతో పాటుగా పిప్పరమింట్ టీ, లవంగం టీ కూడా తలనొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
టీ తాగడం వల్ల కలిగే నష్టాలు
టీని అతిగా తాగడం వల్ల మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి టీ తాగితే.. తలనొప్పి సమస్య మరింత పెరుగుతుంది. అంతేకాదు టీ ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. అలాగే మీ శరీరానికి ఇనుమును గ్రహించే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అలాగే కడుపు చికాకు, వికారం, మైకం వంటి సమస్యలు వస్తాయి.
అయితే టీ తాగడం వల్ల కలిగే ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. ఇది టీ రకం, ఎంత టీ తాగుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ టీని తాగితే లిమిట్ లోనే తాగాలి. అయితే అల్లం టీ, లవంగాల టీ, పిప్పరమింట్ టీ వంటి హెర్బల్ టీలు తాగితే తలనొప్పి తగ్గిపోతుంది. మీకు చాలా కాలంగా మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పి సమస్య ఉంటే మంచి న్యూరాలజిస్ట్ ను సంప్రదించండి.