
టీ లో పాలీఫెనాల్స్, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, అస్థిర సమ్మేళనాలు మరియు ఇతర తెలియని సమ్మేళనాలతో సహా 500కు పైగా వివిధ రసాయన పదార్థాలను అధ్యయనాలు గుర్తించాయి. తాజా టీ ఆకుల్లో కాటెచిన్స్ అని పిలువబడే పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయి. యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-అథెరోస్క్లెరోటిక్ మరియు యాంటీ-క్యాన్సర్తో సహా టీ పాలీఫెనాల్స్ కు అనేక జీవ లక్షణాలున్నాయి.
క్యాన్సర్లు, మధుమేహం, నాడీ సంబంధిత రుగ్మతలు మరియు హృదయ సంబంధ వ్యాధులకు (CVDs) వ్యతిరేకంగా టీ వినియోగం రక్షణాత్మక ప్రభావాలతో ముడిపడి ఉందని పలు ఆధారాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రస్తుత పరిశీలనాత్మక అధ్యయనంలో పరిశోధకులు చైనీస్ పురుషుల్లో టీ తీసుకోవడం మరియు వీర్యం నాణ్యత మధ్య సంబంధాన్ని అంచనా వేశారు. అర్హత కలిగిన 22 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల చైనీయులు వీర్య దానం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఎలాంటి Systemic diseases, లైంగిక సంక్రమణ వ్యాధులు (STDs), జన్యు వ్యాధి (Genetic disease), లేదా జన్యు వ్యాధుల కుటుంబ చరిత్ర లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారే వీర్య దానం చేశారు. ఈ వీర్య నమూనాలను హుబే ప్రావిన్స్ లోని హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ కు అందించారు.
ఇందులో మొత్తం 1,385 మంది పాల్గొన్నారు. అలాగే 6,466 నమూనాలను అందించారు. చాలా మంది రెండు నమూనాలను అందించారు. టీ తాగేవారి సగటు వయస్సు 29.2 సంవత్సరాలు. వీరి సగటు బాడీ-మాస్ ఇండెక్స్ (BMI) 23.4 కిగ్రా/మీ.2. టీ తాగేవారిలో సగానికి పైగా ధూమపానం చేసేవారు (55%) మరియు అప్పుడప్పుడు మద్యం తాగేవారు (56%) ఉన్నారు.
ముడి విశ్లేషణ ఆధారంగా.. టీ తాగేవారు కొంచెం మెరుగైన వీర్య సాంద్రతను కలిగి ఉన్నారు. కానీ టీ తాగని వారి కంటే Sperm motility తక్కువగా ఉందని గుర్తించబడింది. టీ తాగనివారితో పోలిస్తే గ్రీన్ టీ వినియోగదారులు స్వల్పంగా మెరుగైన Sperm motility చూపించారు. గత పదేళ్లలో టీ తాగిన వారిలో వీర్యకణాల సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం టీ తాగని వారితో పోలిస్తే స్పెర్మ్ సాంద్రత 16.27% పెరిగింది. అంతేకాక టీ వినియోగం మరియు వీర్య నాణ్యత మధ్య సంబంధాలను BMI, ధూమపానం మరియు మద్యపాన అలవాట్ల ద్వారా వర్గీకరించారు. గత పదేళ్లుగా టీ తాగేవారికి మరియు తక్కువ బరువు ఉన్న వారిలో వీర్య నాణ్యతకు మధ్య సానుకూల సంబంధాన్ని వారు కనుగొన్నారు.
టీ తాగేవారిలో వీర్యం నాణ్యత మరియు ధూమపానం మధ్య స్పష్టమైన సంబంధం లేదు. అప్పుడప్పుడు ఆల్కహాల్ సేవించేవారు టీ తీసుకోవడం వల్ల (వారానికి మూడు రోజులు) స్పెర్మ్ గాఢత ఎక్కువగా ఉంటుంది. వారానికి కనీసం మూడు రోజులు టీ త్రాగడం స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుందట. ఇది అప్పుడప్పుడు మద్యం సేవించేవారిలో మాత్రమే స్పష్టంగా కనిపించిందని అధ్యయనం చెబుతోంది.
పురుష సంతానోత్పత్తి లేదా పునరుత్పత్తి ఆరోగ్యంపై టీ రక్షణాత్మక ప్రభావాన్ని భవిష్యత్తులో పరిశోధించాల్సిన అవసరం ఉందని ఈ పరిశోధనలు వెల్లడించాయి.