
Health care tips: తినడానికి కొన్ని సమయాలుంటాయి. ఆ పూట తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే వేళా, పాళా మర్చిపోయి తింటే మాత్రం ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఇకపోతే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయానికి భోజనం సవాళుగా మారింది. ఎప్పుడో వీలు కుదిరినప్పుడే కడుపు నింపుకుంటున్నారు. కానీ ఈ అలవాట్లతో ఊబకాయం, థైరాయిడ్, హై బీపీ, మధుమేహం వంటి ఎన్నో సమస్యలు అటాక్ చేసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కొన్నిరకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. లేకపోతే పైన చెప్పిన రోగాలన్నీ మనకు ఖచ్చితంగా సోకుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రి పడుకునే ముందు వీటికి దూరంగా ఉండాలి. మరి ఎలాంటి ఆహారాలను రాత్రి పూట తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
హెవీగా తినకూడదు: రాత్రి సమయంలో డిన్నర్ ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. అలా కాకుండా కడుపు నిండుగా తింటే మాత్రం ఎసిడిటీ, అజీర్థి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు రాత్రి పూట కడుపు నిండుగా తినడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశముంది. అంతేకాదు మీ నిద్రకూడా పాడవుతుంది.
మైదాపిండి: మైదా పిండితో తయారుచేసిన ఆహారాలను రాత్రి పూట తినకూడదు. ఎందుకంటే మైదాతో చేసిన ఆహార పదార్థాలను నైట్ టైం తినడం వల్ల ఊబకాయం వస్తుంది. ముఖ్యంగా దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలోని వివిధ అవయవాలపై చెడు ప్రభావం పడుతుంది.
కోల్డ్ డ్రింక్స్: చాలా మందికి కోల్డ్ డ్రింక్స్ అంటే మహా ఇష్టం. అందులోనూ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉంటారు. అలా చేయడం మంచి పద్దతి కాదు. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు వీటిని అస్సలు తాగకూడదు. ఎందుకంటే వీటిని తాగడం వల్ల మన శరీరంలో కొవ్వులు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదముంది.
ఆల్కహాల్: చాలా మంది పగలు కంటే రాత్రి సమయంలోనే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ అలవాటు అంత తొందరగా కూడా వదులుకోలేరు. కానీ మీరు ప్రయత్నిస్తే సాధన ద్వారా మద్యానికి దూరంగా ఉండొచ్చు. రాత్రి సమయంలో ఆల్కహాల్ తాగడం వల్ల metabolism తగ్గుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ Digestive system పై చెడు ప్రభావం చూపెడుతుంది. దీంతో మీరు స్థూలకాయం బారిన పడతారు.