Sudden Cardiac Arrest: మొదటిసారి వచ్చే గుండెపోటుకే ఎందుకు చనిపోతారు? కారణాలేంటి?

Published : Feb 22, 2022, 09:52 AM IST
Sudden Cardiac Arrest: మొదటిసారి వచ్చే గుండెపోటుకే ఎందుకు చనిపోతారు? కారణాలేంటి?

సారాంశం

Sudden Cardiac Arrest: గుండెపోటు మూడు సార్లు వస్తే ఖచ్చితంగా ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ కొంతమంది మంది మాత్రం మొదటిసారి వచ్చే హార్ట్ స్ట్రోక్ తోనే ప్రాణాలు విడుస్తుంటారు. ఇలా జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి.    

Sudden Cardiac Arrest:ప్రస్తుత కాలంలో చిన్నవయస్సు వారు కూడా గుండె పోటుతో మరణిస్తున్నారు. ఇది ఏ సమయంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కొందరైతే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకున్నా.. ఆకస్మికంగా మరణిస్తున్నారు. మనం గమనించలేని హెల్త్ ఇష్యూస్ వల్లే ఇలా జరుగుతూ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అయితే  చాలా మంది అభిప్రాయం ప్రాకారం.. ఒక వ్యక్తికి మూడు సార్లు హార్ట్ స్ట్రోక్ వస్తేనే అతని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని భావిస్తుంటారు. దీనికి భిన్నంగా మరికొంతమంది మాత్రం మొదటి సారి వచ్చే గుండె పోటుతోనే చనిపోతుంటారు. ఇలా జరగడానికి చాలా కారణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

మన శరీరంలో ఉండే అన్ని కండరాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి రక్తనాళాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే హార్ట్ కు రక్తాన్ని Supply చేసేందుకు కూడా మన శరీరంలో  Major blood vessels ఉంటాయి. ఈ రక్తనాళాల ద్వారే హార్ట్ కు పోషకాలు, ఆక్సిజన్ అందించబడతాయి. 

అయితే ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం మొదలైతే మాత్రం అవి మెల్లిమెల్లిగా మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ కొవ్వు నిల్వలతో రక్తనాళాలు పూడకుకోతే మాత్రం Heart muscle చచ్చుబడిపోతుంటుంది.  దీన్నే గుండెపోటు అంటారు. 

ఈ సమయంలో గుండె మళ్లీ నార్మల్ గా అవ్వాలంటే మాత్రం గుండెకు కావాల్సిన రక్తం అందాలి. అందుకు మనం ముందుగా చేయాల్సిన పని గుండె పోటుకు గురైన వ్యక్తిని వీలైనంత తొందరగా హాస్పటల్ కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని వైద్యులు చెప్పేది. 

కానీ కొన్ని సందర్భాల్లో హార్ట్ స్ట్రోక్ కు గురైన వ్యక్తులను హాస్పటల్ తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోతుంటారుు. దీనికి కారణం వారి గుండె కండరం పూర్తిగా చచ్చిబడిపోవడమే. హార్ట్ కు బ్లడ్ ను తీసుకెళ్లే రక్తనాళాలన్నీ పూర్తిగా మూసుకుపోతే ఇలా జరుగుతుంది. దీని వల్ల శరీరంలోని ఏ అవయవానికి కూడా రక్తం అందదు. అందులోనూ Blood vessels పూడుకుపోయే కొద్దీ.. Blood supply సరిగ్గా జరిగేందుకు పక్కనుంచి Blood vessels వృద్ధి చెందుతాయట.  ఇలా వృద్ధి చెందే వాటిని Collaterals అంటుంటారు. 

అయితే ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు రక్తనాళాలు పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి ఎదురైనప్పుడు  Collaterals వృద్ధిచెందే ప్రసక్తే ఉండదు. అందుకే వారికి హార్ట్ కు రక్తాన్ని సరఫరా చేసేందుకు పక్క నుంచి రక్తనాళాలు ఏర్పడవు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే హార్ట్ స్ట్రోక్ తీవ్రస్థాయిలో వచ్చిందని వైద్యులు చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితి మూలంగానే రోగి మరణిస్తారు. 

అందుకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు హెల్త్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ రక్తనాళాలు పూడికకు గురవుతుంటే స్టెంట్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే బ్లడ్ పల్చబడే మెడిసిన్స్ ను వాడాలని వైద్యలు సూచిస్తున్నారు. ముఖ్యంగా  Blood vessels మూసుకుపోవడం మొదలైతే.. వైద్యులను సంప్రదించి శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమం. 

PREV
click me!

Recommended Stories

Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు
Spring Onion Benifits: ఆహారంలో ఇవి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?