దీపావళి పండుగ నాడు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి..!

By Shivaleela Rajamoni  |  First Published Nov 4, 2023, 2:16 PM IST

Diwali 2023: దీపావళి పండుగ నాడు ఇంటినిండా దీపాలను వెళిగించడంతో పాటుగా రకరకాల టపాసులను కూడా పేల్చుతుంటారు. కానీ టాపాసులను పేల్చేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు మీరు కొన్ని పనులను చేస్తే సేఫ్ గా ఉంటారు..అవేంటంటే?
 


Diwali 2023:ఈ ఏడాది దీపావళి పండుగను ఈ నెల 12న ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నాం. అయితే దీపావళికి లక్ష్మీదేవి, వినాయక కొత్త విగ్రహాలను కొని ఇంటికి తెస్తారు. దీనివల్ల ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదనే నమ్మకం. ఇక దీపావళి సందర్భంగా ఇంటిని అందంగా ముస్తాబు చేయడంతో పాటుగా.. ఆ రోజు అందంగా రెడీ అయ్యేందుకు కొత్తబట్టలను, కొత్త నగలను కూడా కొంటారు. దీపావళి పండుగేం చిన్నది కాదు. దీన్ని మన దేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. 

ఇక దీపావళి సందర్భంగా టపాసులను పక్కాగా పేల్చుతారు. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే. కానీ కొన్ని అజాగ్రత్తల వల్ల ప్రతి ఏడాది ఈ పండుగ వల్ల ఎంతో మంది గాయలపాలు అవుతుంటారు. మీకు తెలుసా? టపాసులను పేల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. అంతేకాదు వీటిని సరిగ్గా కాల్చడం తెలియక, అజాగ్రత్తగా ఉండటం వల్ల ఎన్నో గాయలు కూడా అవుతుంటాయి. ఇలాంటి సమస్యలేం రాకూడదంటే.. దీపావళి నాడు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos

 

  • టపాసులు పేల్చేటప్పుడు, దీపాలు వెలిగించేటప్పుడు మీరు సింథటిక్ దుస్తులను వేసుకోకూడదు. వీటికి బదులుగా కాటన్ దుస్తులను వేసుకోండి. 
  • ముఖ్యంగా ఏ సమయంలోనైనా అవసరం రావొచ్చు. కాబట్టి బకెట్ లో నీటిని మీకు అందుబాటులో ఉంచుకోండి. 
  • మీ చెవులు టపాసుల సౌండ్స్ కు దెబ్బతినకుండా చెవుల్లో కాటన్ ప్లగ్లను పెట్టండి. ఎందుకంటే క్రాకర్స్ శబ్దం మీ చెవులను దెబ్బతీస్తుంది. 
  • టపాసులను కాల్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా పారేయాలి. పేలని టపాసులు ఉంటే ఎందుకు పేలడం లేదని పరిశీలించడానికి ట్రై చేయకండి. 
  • చేతుల్లో టపాసులను పేలుస్తూ విన్యాసాలు చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇవి మానుకోండి. ఎందుకంటే ఇవి మీ చేతుల్లో పేలే అవకాశం ఉంది. ఇలా అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. 
  • చిన్నపాటి  కాలిన గాయం అయినా.. మంట తగ్గే వరకు కాలిన గాయాలను చల్ల నీటితో కడగకండి. నీటిని చల్లకండి. 
  • ఒకవేళ అగ్నిప్రమాదం జరిగినట్టైతే వెంటనే అగ్నిమాపక దళానికి కాల్ చేయండి.
  • క్రాకర్ లేబుల్ పై ముద్రించిన సూచనలను ఖచ్చితంగా చదవండి. ముఖ్యంగా కొత్తగా క్రాకర్స్ ను కాల్చుతున్నవారు. 
  • చాలా మంది తమ సరాదా కోసం జంతువుల దగ్గర క్రాకర్స్ ను పేలుస్తుంటారు. కానీ ఇలా చేయకండి. 
  • ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ లో టపాసులను పేల్చకూడదు. మీ చుట్టుపక్కల మండే పదార్థాలు ఉన్నప్పుడు టపాసులను పేల్చకూడదు. 
  • క్రాక్ర్స్ ను కంటైనర్ లో వేసి మూయకూడదు. 
  • టపాసులను కాల్చేటప్పుడు సురక్షితమైన దూరాన్ని పాటించాలి. 
  • టపాకాయలు కాల్చేటప్పుడు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో హెయిర్ లీవ్ చేయకూడదు. పొడవాటి జుట్టున్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. 
  • ముఖ్యంగా పిల్లలు టపాసులు పేల్చేటప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉండాలి. 
  • ఎలాంటి శ్వాసకోశ సమస్యలున్నా సరే వారు ఇంట్లోనే ఉండాలి.
  • క్రాకర్స్ కాల్చేటప్పుడు చెప్పులు ఖచ్చితంగా వేసుకోవాలి.
click me!