డిప్రెషన్ లో ఉన్నారా... రెడ్ వైన్ తో పరిష్కారం

By telugu teamFirst Published Jul 30, 2019, 12:17 PM IST
Highlights

రెడ్ వైన్ ని ద్రాక్ష పండ్లతో తయారు చేస్తారు. కాగా...ద్రాక్షలో ఉండే ఓ పదార్థం డిప్రెషన్ పోవడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. డిప్రెషన్, యాంగ్జైటీలను ప్రేరేపించే ఎంజైమ్ ను రెడ్ వైన్ లో ఉండే రిస్వరట్రాల్ అడ్డుకుందని పరీక్షలో వెల్లడైంది.
 
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం మనకు తెలిసిందే. అయితే... రెడ్ వైన్ మాత్రం ఇందుకు పూర్తి విభిన్నం అంటున్నారు నిపుణులు. మితంగా తీసుకుంటే రెడ్ వైన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. రెడ్ వైన్ లో ఉండే ఓ పదార్థం డిప్రెషన్ నుంచి బయటపడేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడయ్యింది.

రెడ్ వైన్ ని ద్రాక్ష పండ్లతో తయారు చేస్తారు. కాగా...ద్రాక్షలో ఉండే ఓ పదార్థం డిప్రెషన్ పోవడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. డిప్రెషన్, యాంగ్జైటీలను ప్రేరేపించే ఎంజైమ్ ను రెడ్ వైన్ లో ఉండే రిస్వరట్రాల్ అడ్డుకుందని పరీక్షలో వెల్లడైంది.

ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు డిప్రెషన్, యాంగ్జైటీలో నూతన చికిత్సలకు దారి తీస్తాయని వారు భావిస్తున్నారు. ఈ రెండు వ్యాధులపై రిస్వరట్రాల్ ప్రభావాన్ని యూనివర్శిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఎలుకలపై పరీక్షించడం ద్వారా అంచనా వేశారు. క్యాన్సర్, అర్థరైటిస్, డిమెన్షియా సహా పలు వ్యాధులను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం రిస్వరట్రాల్ కి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వేరుశెనగ పప్పులోనూ రిస్వరట్రాల్ ఉంటుందని... ఇది శరీరంలోని వాపు తగ్గించేందుకు ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. హాని చేసే కొవ్వును నియంత్రించడం, మెదడు పనితీరు మెరుగుపరచడం, బీపీని నియంత్రించడంలోనూ ఇది మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు  చెబుతున్నారు. 

click me!