Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 3 పనులు చేశాక కచ్చితంగా స్నానం చేయాలి

Published : Mar 05, 2025, 04:18 PM IST
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 3 పనులు చేశాక కచ్చితంగా స్నానం చేయాలి

సారాంశం

ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. ఆయన నీతి సూత్రాలు జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. భార్యాభర్తల బంధం, విజయం, ప్రేమ, స్నేహం లాంటి ఎన్నో విషయాల గురించి ఆయన తన నీతి సూత్రాల్లో బోధించాడు. చాణక్య నీతి ప్రకారం 3 పనులు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్నానం చేయాలట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆచార్య చాణక్యుడు బోధించిన చాలా విషయాలు మానవ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చాణక్య నీతి సూత్రాల్లోని చాలా విషయాలు ఇప్పటికీ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. చాలామంది వీటిని ఫాలో కూడా అవుతుంటారు. ప్రేమ, ద్వేషం, కుటుంబం, స్నేహం ఒకటేంటి ఎన్నో అంశాల గురించి ఆయన నీతిసూత్రాల్లో పేర్కొన్నాడు.  

చాణక్య నీతి ప్రకారం కొన్ని పనులు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కచ్చితంగా స్నానం చేయాలి. లేదంటే దురదృష్టం వారి తలుపు తడుతుందట. వాటి నెగెటివ్ ఎఫెక్ట్ లైఫ్‌లో చాలా చిక్కులు తెస్తుందట. ఇంతకీ ఆ పనులెంటో? వాటిని చేశాక ఎందుకు స్నానం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

చాణక్య నీతి ప్రకారం ఏ పనులు చేశాక స్నానం చేయాలి?

ఆచార్య చాణక్యుడి బోధించిన నీతి సూత్రాల ప్రకారం ఆడవారైనా, మగవారైనా శారీరక సంబంధం పెట్టుకున్న ప్రతిసారీ తప్పకుండా స్నానం చేయాలట. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల జబ్బులు కూడా రావచ్చు. కాబట్టి స్నానం చేయడం చాలా ముఖ్యం. ఈ విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. చాలా ఇండ్లలో పెద్దవాళ్లు కూడా ఈ విషయాన్ని చెబుతుంటారు.

చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరూ జుట్టు కత్తిరించుకున్నాక స్నానం చేయాలి. అలా చేయకపోతే ఆ వెంట్రుకలు మీ శరీరానికి అంటుకుంటాయి. దీనివల్ల అసౌకర్యంగా, దురదగా కూడా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ వెంట్రుకలు మీకు తెలియకుండానే ఆహారం లేదా నీటి ద్వారా కడుపు లోపలికి వెళ్లొచ్చు. ఇది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి హేయిర్ కట్ చేసుకున్నాక స్నానం చేయడం చాలా ముఖ్యం.

చాణక్య నీతి ప్రకారం శరీరానికి నూనె రాసుకున్న ప్రతిసారీ కాసేపు ఆగి స్నానం చేయాలట. ఇలా చేయడం వల్ల శరీరం నుంచి చెమట శుభ్రం అవుతుంది. హుషారుగా ఉంటారు. అంతేకాదు శరీరం మీద ఉన్నజిడ్డు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం ఈ మూడు విషయాలను కచ్చితంగా పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Blouse Designs: కళ్లు చెదిరిపోయేలా హెవీ బ్లవుజు డిజైన్లు
డిసెంబర్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది