వేడి నీటితో స్నానం చేస్తే... దాని అవసరం లేనట్టే!

By telugu teamFirst Published Aug 13, 2019, 2:41 PM IST
Highlights

వ్యాయం చేయని వారు రోజూ వేడినీటి స్నానం చేయడం ద్వారా కొంత వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే వేడినీటితో స్నానం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో వేడి పుడుతంది.. అలాగే వేడీ నీటి స్నానంతోనూ అదే ప్రక్రియ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో... వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేస్తే... తొందరగా జబ్బుల బారినపడకుండా ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. రోజూ వ్యాయమం చేసి..ఏదైనా పని కారణంగా ఒకరోజు మిస్ అయ్యిందే అనుకోండి.. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు వేడి నీటితో స్నానం చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయం చేయని వారు రోజూ వేడినీటి స్నానం చేయడం ద్వారా కొంత వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే వేడినీటితో స్నానం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో వేడి పుడుతంది.. అలాగే వేడీ నీటి స్నానంతోనూ అదే ప్రక్రియ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయంలో దాదాపు 2,300మంది మధ్య వయసు వ్యక్తులను దాదాపు 20ఏళ్లపాటు పరిశీలించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.  వీరిలో వారానికి ఒకసారి ఆవిరి స్నానం చేసిన వారు 20ఏళ్ల కాలంలో సగం మంది మృతి చెందారు. వారంలో రెండు నుంచి మూడు సార్లు ఆవిరి స్నానం చేసిన వారిలో 38శాతం మంది మాత్రమే అదే కాల్యవవధిలో కన్నుమూశారు. ఎక్కువసార్లు ఆవిరి స్నానం చేసేవారిలో గుండెపోటు, ఇతర గుండె సమస్యల మప్పు తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలో పరిశోధకులు గుర్తించారు. ఆవిరి స్నానంతో రక్త సరఫరా పెరగడం, రక్తపోటు తగ్గడం వలనే ఈ ఫలితాలు కలుగుతున్నాయని వారు చెబుతున్నారు.
 
click me!