అలా అన్నింటికీ అరవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు అనే విషయాన్ని వారికి చెప్పాలి. ఈ విషయంలో బౌండరీస్ సెట్ చేయాలి.
చాలా మంది భర్తలు... ప్రతి విషయంలో భార్యపై అరుస్తూ ఉంటారు. చుట్టూ ఎంతమంది ఉన్నారని కూడా చూడకుండా చాలా మంది అరిచేస్తూ ఉంటారు. అయితే... భర్తలు అలా అరవకుండా ఉండాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం..
1.మీ భర్త మీ పై అరుస్తున్నారు అంటే.... దానిని మీరు అంగీకరించడం లేదు అనే విషయాన్ని వారికి మీరే తెలియజేయాలి. అరవడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని వారికి తెలియజేయాలి. అలా అన్నింటికీ అరవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు అనే విషయాన్ని వారికి చెప్పాలి. ఈ విషయంలో బౌండరీస్ సెట్ చేయాలి.
undefined
2.మీ భర్త మీ పై ఏ విషయం పై అరుస్తున్నాడు అనే విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలి. దానికోసం ఇద్దరూ కలిసి పనిచేయాలి.
3.ముందు మీ భర్త మీ మీద అరవకుండా మీరే చూసుకోవాలి. దాని కోసం వారికి కోపం ఏ విషయంలో వస్తుందో మీరే తెలుసుకొని.. వారు అరవకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. వారు చెప్పేది ఓపిక వినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు సమస్య అరిచేదాక రాకపోవచ్చు.
4.చాలా మంది మహిళలు చేసే పొరపాటు ఇది. మీ భర్త అరవగానే వెంటనే రియాక్ట్ అయ్యి... వారితో వాదనకు దిగుతూ ఉంటారు. అలా కాకుండా.... వారు ఎంత అరిచినా... మీరు ప్రశాంతంగా ఉండటం వల్ల చాలా వరకు సమస్యను పరిష్కరించవచ్చు. ఓపికగా ఉండటం వల్ల గొడవను సద్దుమణిగేలా చేయవచ్చు.
5.మీ భర్త మీపై అరిచినప్పుడు మీరు వెంటనే అప్ సెట్ అవ్వకుండా... ఆ విషయం నుంచి మీరు బ్రేక్ తీసుకోవాలి. తర్వాత.... మీరిద్దరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
6.మనం మాట్లాడే మాటలు, ఉపయోగించే పదాలు కూడా సమస్యను పరిష్కరిస్తాయట. నువ్వు ఎప్పుడూ నా మీద అరుస్తూనే ఉంటావు అనే బదులు.. నువ్వు అరుస్తుంటే నాకు బాధ కలుగుతోంది అని చెప్పడం మంచి మార్గం. ఇలా చెప్పడం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారనే విషయం వారికి అర్థం అవుతుంది.
7.ఇక.. మీరు ఎలాంటి తప్పులు చేయకపోయినా.. మీ భర్త మీ పై అరుస్తున్నారు అంటే... వారిని కౌన్సిలింగ్ కి తీసుకువెళ్లాలి. అలా తీసుకువెళ్లడం వల్ల వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.