పరగడుపున నిమ్మరసం.. ఎన్నిప్రయోజనాలో...

Published : Jan 25, 2019, 02:52 PM ISTUpdated : Jan 25, 2019, 02:56 PM IST
పరగడుపున నిమ్మరసం.. ఎన్నిప్రయోజనాలో...

సారాంశం

గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆ వాటర్ తాగితే.. రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

పరగడుపున గోరువెచ్చగా మంచినీరు, నిమ్మరసం పిండిన నీరు తాగమని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆ వాటర్ తాగితే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతేకాదు శరరీంలో ఉండే వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా లివర్ శుభ్రపడుతుంది. తరచూ జలుబు బారిన పడేవారికి ఇది చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.

అంతేకాదు.. మెటిమలు, దద్దుర్లు, ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. బరువుని తగ్గించడంలోనూ.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. దంత సమస్యలు, నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. 

PREV
click me!

Recommended Stories

ఉదయమా లేక రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!