మన దేశంలో జనాలు ఏ టైమ్ కి నిద్ర లేస్తారో తెలుసా?

By telugu news teamFirst Published Dec 2, 2023, 11:32 AM IST
Highlights

యావరేజ్ మన భారతీయులు ఏ సమయానికి  నిద్ర లేస్తారో తెలుసా? కేవలం భారతీయులే కాదు, ఇతర దేశాల్లోనూ ఏ దేశం వారు ఏ సమయానికి నిద్ర లేస్తారో ఓసారి చూద్దాం...
 

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం గా మారిపోయింది. పడుకున్నామా , తెల్లారిందా, లేచామా తిన్నామా, పని చేసుకున్నామా మళ్లీ పడుకున్నామా అన్నట్లుగా సాగుతోంది. ప్రతి ఒక్కరూ తమ పనిని పట్టి, ఉదయం నిద్ర లేస్తూ ఉంటారు. కొందరు ఉదయం ఆరుగంటలకే నిద్రలేస్తారు. మరి కొందరు 9 గంటలు దాటినా కూడా నిద్రలేవకుండా పడుకునేవారు కూడా ఉంటారు. ఒక ఇంట్లో చూసుకుంటేనే ఒక్కొక్కరు ఒక్కో సమయానికి లేస్తూ ఉంటారు.  అయితే, యావరేజ్ మన భారతీయులు ఏ సమయానికి  నిద్ర లేస్తారో తెలుసా? కేవలం భారతీయులే కాదు, ఇతర దేశాల్లోనూ ఏ దేశం వారు ఏ సమయానికి నిద్ర లేస్తారో ఓసారి చూద్దాం...

1.కొలంబియా- 6:31
2.ఇండోనేషియా- 6:55
3.జపాన్- 7:09
4.మెక్సికో- 7:09
5.డెన్మార్క్- 7:19
6.US- 7:20
7.జర్మనీ- 7:25
8.బ్రెజిల్- 7:31
9.కెనడా- 7:33
10.UK- 7:33
11.భారతదేశం- 7:36
12.చైనా- 7:42
13.టర్కీ- 8:02
14.స్పెయిన్- 8:05
15.రష్యా- 8:06
16.గ్రీస్- 8:25
17.అరేబియా- 8:27

Latest Videos

అన్ని దేశాల్లో కంటే, కొలంబియా దేశస్తులు చాలా త్వరగా నిద్రలేస్తున్నారు. వాళ్లు యావరేజ్ గా  6గంటల 31 నిమిషాలకు నిద్ర లేస్తారు. ఇక, మన భారతీయులు యావరేజ్ గా 7గంటల 36 నిమిషాల సమాయానికి నిద్రలేవడానికి ఇష్టపడుతున్నారట. ఇక, అరేబియా దేశస్తులు ఎక్కువ సేపు నిద్రపోతున్నారట. వారు యావరేజ్ గా 8గంటల 27 నిమిషాల వరకు నిద్రపోతున్నారట. మనకన్నా, అమెరికా, జపాన్, మెక్సికో, ఇండోనేషియా దేశస్థులు తొందరగ నిద్ర లేవడానికి ఆసక్తి చూస్తున్నారు. మరి, మీరు ఏ సమయానికి నిద్ర లేస్తున్నారు..?

click me!