బ్యాకాంక్ ట్రిప్ కి ఇక గ్రీన్ సిగ్నల్..!

By telugu news teamFirst Published Sep 13, 2021, 2:29 PM IST
Highlights

ప్రస్తుతం కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ అక్కడ పర్యాటకునుల స్వాగతించడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి.. పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు.
 

ఈ మధ్యకాలంలో చాలా మంది ట్రిప్ కి వెళ్లాంటే.. వారి ఫస్ట్ చాయిస్ బ్యాంకాక్ గా మారింది. ఇక సెలబ్రెటీల సంగతైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  చాలా మంది హీరోయిన్లు,  సెలబ్రెటీలు.. బ్యాంకాంక్ ట్రిప్ ఎంజాయ్ చేశారు. అయితే.. మనలో చాలా మందికి కూడా ఈ బ్యాకాంక్ ట్రిప్ కి వెళ్లాలని అనుకున్నారు. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా.. అక్కడ వెకేషన్ కి బ్రేక్ వేశారు.

దీంతో.. చాలా మంది బ్యాంకాక్ ట్రిప్ లు క్యాన్సిల్ అయిపోయాయి. కాగా.. తాజాగా..  అక్కడి టూరిజం డిపార్ట్మెంట్ మనకు శుభవార్త తెలియజేసింది. బ్యాకాంక్ లో పర్యాటకానికి మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ అక్కడ పర్యాటకునుల స్వాగతించడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి.. పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా, పర్యాటకం మరియు విమానయాన పరిశ్రమ అతిపెద్ద  దెబ్బ తగిలిందని  మనందరికీ తెలుసు. థాయ్‌లాండ్‌లో, పర్యాటకం వారి జాతీయ ఆదాయాన్ని అందించడంలో 5 వ స్థానంలో ఉందట. అయితే.. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు.. పర్యటకులపై ఆంక్షలు విధించారు.

అయితే, ఇప్పుడు, థాయ్‌లాండ్ టూరిజం అథారిటీ అక్టోబర్ 1 నుండి, కోవిడ్ రెండు డోసులు తీసుకున్న అంతర్జాతీయ పర్యాటకులు నాలుగు ఇతర ప్రావిన్సులతో పాటు బ్యాంకాక్‌ను  సందర్శించడానికి అనుమతి ఇఛ్చింది. 

అలాగే, మీరు పూర్తిగా టీకాలు వేసినట్లయితే, మరియు మీరు 14 రోజుల హోటల్ క్వారంటైన్  రూల్స్ పాటించాల్సిన అవసరం కూడా లేదు.  ఈ అవకాశం  చియాంగ్ మాయి, చోన్ బురి, ఫెట్చాబురి , ప్రచువాప్ ఖిరి ఖాన్ ప్రావిన్సులతో సహా ఐదు ప్రాంతాలలో అందుబాటులో ఉంటుందని  అధికారులు  చెబుతున్నారు.

click me!