240గ్రాములు బరువున్న ఒక్క యాపిల్ లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందట. ఈ విషయం తెలిస్తే... చాలా మంది వీటిని తినడానికి కూడా ఆసక్తి చూపించరేమో. కానీ ఇది నిజం. ఈ బ్యాక్టీరియా కారణంగా మనకు లేనోపోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజుకో యాపిల్ తింటే... డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని ఇంగ్లీష్ లో ఓ సామేత ఉంది. యాపిల్ రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అలా చెబుతుంటారు. యాపిల్ లో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం లాంటివి పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలే. కానీ.. ఇప్పటి వరకు మనకు తెలియని విషయం ఒకటి యాపిల్ గురించి బయటపడింది.
240గ్రాములు బరువున్న ఒక్క యాపిల్ లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందట. ఈ విషయం తెలిస్తే... చాలా మంది వీటిని తినడానికి కూడా ఆసక్తి చూపించరేమో. కానీ ఇది నిజం. ఈ బ్యాక్టీరియా కారణంగా మనకు లేనోపోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి యాపిల్ తినడం మానేయాలా అంటే అసవరం లేదని చెబుతున్నారు. ఇందుకు చేయాల్సిందల్లా... సంప్రదాయ రీతిలో కాకుండా.. ఆర్గానిక్ రీతిలో పండించిన యాపిల్ పండ్లను తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.
ఆపిల్ పండ్లలో ఎక్కువ శాతం గింజల్లో బ్యాక్టీరియా ఉంటుంది. తర్వత మిగితా భాగంలో ఉంటుంది. మంచి బ్యాక్టీరియా అయితే.. అది మన శరీరానికి ఉపయోగమే. ఆర్గానిక్ యాపిల్ పండ్లలో ఆరోగ్య కరమైన బ్యాక్టీరియా ఉంటుంది. దాని వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప నష్టం ఏమీ ఉండదని చెబుతున్నారు.