మృదువైన పాదాల కోసం...

By telugu team  |  First Published Jun 26, 2019, 4:50 PM IST

గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిగా నూనె వేసి పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొడి చర్మం పోయి పాదాలు మృదువుగా తయారువుతాయి


చాలా మంది అమ్మాయిలు ముఖం, చర్మం, శిరోజాలపై పెట్టిన దృష్టి పాదాలపై పెట్టరు. కానీ... పాదాలు కూడా అందాన్ని పెంచుతాయన్న విషయాన్ని గుర్తించాలి. పాదాలు మృదువుగా, అందంగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుందని నిపుణులు  చెబుతున్నారు. అవేంటో మనమూ ఓసారి చూసేద్దామా...

గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిగా నూనె వేసి పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొడి చర్మం పోయి పాదాలు మృదువుగా తయారువుతాయి.గోరువెచ్చటి నీటిలో పాదాలు ఉంచడం వల్ల మృతకణాలు పోతాయి. ఇది అందరికీ తెలుసు కానీ చేయరు. అయితే వారానికి రెండుసార్లు కనుక పాదాలు ఇలా శుభ్రం చేసుకుంటే మృదువుగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

undefined

నిత్యం పాదాలను శుభ్రం చేసుకోవడం వల్ల పాదాలపై ఉండే రఫ్‌ చర్మం పోయి సున్నితంగా తయారవుతుంది. వాటికి మాయిశ్చరైజర్‌ పట్టించడం మరవొద్దు.

సాయంత్రాలు పాదాలకు మాయిశ్చరైజర్‌ క్రీమును పట్టించి, కాటన్‌ సాక్స్‌ వేసుకొని, వాటితోనే రాత్రి పడుకోవాలి.కొద్దిగా లిక్విడ్‌ సోప్‌ లేదా జెల్‌తో పాదాలను శుభ్రంగా కడుక్కుంటే అందంగా కనిపిస్తాయి.

మడమలను స్క్రబ్బర్‌తో రుద్దుకునేటప్పుడు కాలి వేళ్ల మధ్య కూడా శుభ్రం చేసుకోవడం మరవొద్దు.కాలివేళ్లకు ఉన్న గోళ్లను తీసేసి శుభ్రం చేసుకోవాలి. గోళ్లను పెంచుకుంటే వాటికి నెయిల్‌ పాలిష్‌ వేసుకోవాలి.

పాదాలపై పొడి చర్మం ఉండకుండా చూసుకోవడంతో పాటు తప్పనిసరిగా వాటికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. స్నానం అయిన వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

పాదాల అంచులు చాలామందికి పగలడం చూస్తాం. పగుళ్ల వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఈ పగుళ్లను పోగొట్టుకోవాలంటే క్యాండిల్‌ వాక్స్‌ కరగబెట్టి అంతే మొత్తంలో ఆవ నూని అందులో కలిపి పేస్టులా చేసి పాదాల అంచులకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.

click me!