కేరళ: పాలక్కాడ్‌లో మెట్రో శ్రీధరన్ ముందంజ

By narsimha lodeFirst Published May 2, 2021, 9:26 AM IST
Highlights

 కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన  మెట్రో మ్యాన్  శ్రీధరన్ ఆధిక్యంలో నిలిచారు.

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన  మెట్రో మ్యాన్  శ్రీధరన్ ఆధిక్యంలో నిలిచారు.కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే  శ్రీధరన్  సీఎం అభ్యర్ధి అనే ప్రచారం సాగింది. అవినీతి మచ్చలేని  శ్రీధరన్ ను బీజేపీ కేరళలో తెరమీదికి తీసుకొచ్చింది. 

కేరళ రాష్ట్రంలోని 140 సీట్లకు గాను ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నిక జరిగింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండి ఎంపీగా గెలుపొందడం, శబరిమల అంశము అన్ని వెరసి జాతీయ నాయకత్వమంతా కేరళలో తిష్ట వేసింది. ప్రధానంగా ఎల్ డి ఎఫ్, యూ డి ఎఫ్ కూటముల మధ్య పోరు సాగినప్పటికీ... తమ ప్రాబల్యాన్ని పెంచుకొని రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ సైతం ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం సాగించింది. కేరళలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారడమనేది ఒక నిత్యకృత్యంగా తయారయింది. దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కేరళనే. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకొని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఎల్ డి ఎఫ్ రంగంలోకి దిగింది. 

దేశవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న కాంగ్రెస్ కి ఈ రాష్ట్రం గెలవడం అత్యవసరం. ఇక్కడ విజయం సాధించడం ద్వారా మొత్తం కాంగ్రెస్ క్యాడర్ లో ఒక జోష్ తీసుకురావొచ్చని వారు భావిస్తున్నారు. దానికి తోడు ఇక్కడ విజయాన్ని సాధించడాం ద్వారా రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా ఒక ఆమోదముద్ర పడుతుందని అనుకున్నాయి కాంగ్రస్ వర్గాలు. . ఇక శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ సాధ్యమైనంత మేర వాడుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ అంశం కలిసివస్తదని భావించినప్పటికీ... అది అంతలా కలిసిరాలేదు.

click me!