కేరళ: అసెంబ్లీ ఎన్నికల వేళ షాక్, కాంగ్రెస్‌కు పీసీ చాకో గుడ్‌బై

By Siva KodatiFirst Published Mar 10, 2021, 3:00 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్‌పై చాకో సంచలన వ్యాఖ్యలు చేశారు

అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్‌పై చాకో సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు లేకుండా ఏడాది నుంచి పార్టీ నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో అసలు నాయకత్వమే లేదని, ప్రజాస్వామ్యమే లేదని చాకో ఆరోపించారు. 

కేరళలో స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన పీసీ చాకో కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

మొదటిసారి పిరవం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈకే నాయనర్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మూడు సార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన 2జీ స్కాంలో ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించారు.

2014 ఎన్నికల్లో చిలకుడి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 74 ఏళ్ల పీసీ చాకో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.

అది కూడా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం విశేషం. ఆయన మరేదైనా పార్టీలో చేరతారా? లేదా అనే విషయంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
 

click me!