కరీంనగర్ బిజెపి షాక్... టీఆర్ఎస్ లో చేరిన కీలక నేత

By Arun Kumar P  |  First Published Jan 19, 2020, 12:56 PM IST

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు రోజుకో విధంగా మారుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ ముున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. 


కరీంనగర్: తెలంగాణలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో అత్యంత రసవత్తర పోరు సాగుతున్న జిల్లా కరీంనగర్. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొనడంతో వ్యూహ ప్రతివ్యూహాలతో నాయకులు రంగంలోకి దిగుతున్నారు. మరీ ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పేరేషన్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నారు. అధికార  టీఆర్ఎస్ తరపున గంగుల కమాలకర్, బిజెపి తరపున ఎంపీ బండి సంజయ్ గెలుపుకోసం  ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బిజెపి గంగుల కమలాకర్ చిన్న ఝలక్ ఇచ్చారు. గతంలో టీఆర్ఎస్ నుండి బిజెపిలో చేరిన చిగురుమామిడి మాజీ జడ్పీటీసి శేఖర్ ను మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేర్చారు. మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో శేఖర్ టిఆర్ఎస్ లో చేరారు.

Latest Videos

undefined

read more  జగిత్యాల ప్రజలే బామ్మర్దులకు బుద్దిచెప్పాలి: ఓవైసి బ్రదర్స్ పై విరుచుకుపడ్డ రాజాసింగ్

ఈ సందర్భంగా మంత్రి అతడితో ''నువ్వేం భాదపడకు శేకర్ నేను ఉన్నాగా'' అంటూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంకోసం పనిచేయాలని... తగిన విధంగా గౌరవిస్తామని శేఖర్ కు మంత్రి భరోసా ఇచ్చారు. 

సొంతగూటికి చేరిన శేఖర్ మాట్లాడుతూ... టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి బిజెపి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ను గెలిపించి బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి  మళ్లీ చేరినట్లు శేఖర్ వెల్లడించారు. 

read more  గెలుపు కాదు... ఆ పార్టీలకు అభ్యర్థులే కరువు: మంత్రి కొప్పుల సెటైర్లు

click me!