ఐ‌టి‌ఐ చేసిన వారికి ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి..

By S Ashok KumarFirst Published Mar 9, 2021, 4:07 PM IST
Highlights

వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ప్లంబర్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

 ఇండియన్ రైల్వేకి చెందిన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఇందులో భాగంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వీటిలో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ప్లంబర్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Latest Videos

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొయిదలైంది. మార్చి 30 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్  https://wcr.indianrailways.gov.in/లో చూడవచ్చు.

ఇందులో ఉన్న మొత్తం ఖాళీలు: 165

also read హెచ్‌పీసీఎల్‌‌లో భారీగా ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు.. ...

ఫిట్టర్- 45, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 28, ఎలక్ట్రీషియన్- 18, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 8, సెక్రెటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)- 5, పెయింటర్ (జనరల్)- 10, కార్పెంటర్- 20, ప్లంబర్- 8, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2, టైలర్ (జనరల్)- 5, మెకానిక్, (డీజిల్)- 7, మెకానిక్ (ట్రాక్టర్)- 4, ఆపరేటర్ (అడ్వాన్స్‌డ్ మెషీన్ టూల్)- 5

విద్యార్హతలు: ఇంటర్‌ లేదా తత్సమన అర్హతతో  పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తులు ప్రారంభం: 1 మార్చి 2021

దరఖాస్తుకు చివరి తేదీ: 30 మార్చి 2021

దరఖాస్తు ఫీజు: రూ.170. ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, మహిళలు రూ.70 చెల్లించాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌:https://wcr.indianrailways.gov.in/

click me!