టెన్త్‌, ఐటీఐ అర్హత కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష ద్వారా ఎంపిక.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

By S Ashok KumarFirst Published Mar 5, 2021, 6:52 PM IST
Highlights

ఇండియన్‌ నేవీ దేశంలోని వివిధ నేవల్‌ కమాండ్‌లలో 1159 ట్రేడ్స్‌మ్యాన్‌మేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇందులో 710 పోస్టులు విశాఖపట్నంలో కేటాయించారు. 

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్‌ నేవీ దేశంలోని వివిధ నేవల్‌ కమాండ్‌లలో 1159 ట్రేడ్స్‌మ్యాన్‌మేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇందులో 710 పోస్టులు విశాఖపట్నంలో కేటాయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.joinindiannavy.gov.in/లో చూడవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఫిబ్రవరి 22 నుండి  ప్రారంభమవుతుంది. ధరఖాస్తు చేసుకోవడానికి  చివరి తేదీ మార్చి 7. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐ‌ఎన్‌సి‌ఈ‌టి ) ద్వారా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆయా కమాండ్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్- విశాఖపట్నం: 710

హెడ్‌క్వార్టర్స్ వెస్టర్న్ నేవల్ కమాండ్- ముంబై: 324

హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్- కొచ్చి: 125

అర్హత: 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

also read 10వ తరగతి అర్హత ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ల్ చేయండి.. ...

వయసు: 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు: నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు చెల్లిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.205/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 22 ఫిబ్రవరి 2021.

దరఖాస్తుకు చివరి తేది: 07 మార్చి 2021.

అధికారిక వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

click me!