విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్ 2020-21 బ్యాచ్‌కు సంబంధించి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతితో పాటు సంబంధింత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్రెంటిస్‌షిప్ కోసం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్ పోస్టుల వివరాలు.
undefined
ఖాళీల సంఖ్య: 275
1.ఎలక్ట్రీషియన్: 29
2.ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 32
3.ఫిట్టర్: 29
also read Indian navy jobs:ఇండియన్ నేవీ ఆఫీసర్ 2019 నోటిఫికేషన్ విడుదల.
4.ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 15
5.మెషినిస్ట్: 19
6.పెయింటర్ (జనరల్): 15
7.రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్: 19
8.వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్): 23
9.కార్పెంటర్: 23
10.ఫౌండ్రీమ్యాన్: 07
11.మెకానిక్ (డీజిల్): 14
12.షీట్ మెటల్ వర్కర్: 29
13.పైప్ ఫిట్టర్: 21
అర్హత: 50 శాతం మార్కలతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులతో ఐటీఐ ఉండాలి.
జనరల్ అభ్యర్థులు 01.04.1999 - 01.04.2006 మధ్య జన్మించి ఉండాలి అలాగే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 01.04.1994 - 01.04.2006 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం: రాతపరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకటిన్నర మార్కులు. వీటిలో మ్యాథమెటిక్స్-20, జనరల్ సైన్స్-20, జనరల్ నాలెడ్జ్-10 ప్రశ్నలు అడుగుతారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి ట్రేడ్‌కు సంబంధించిన టెక్నికల్ స్కిల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్య్యూలో అర్హత సాధించినవారికి చివరగా మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
also read Navy Jobs:ఇండియన్ నేవీ 2020 నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 05.12.2019
దరఖాస్తుల సమర్పణకు చివరితేది (ఆఫ్‌లైన్): 12.12.2019
రాతపరీక్ష తేది: 29.01.2020
రాతపరీక్ష ఫలితాలు: 31.01.2020
ఇంటర్వ్యూ తేది: 03 - 06.02.2020
మెడికల్ పరీక్ష తేది: 04 - 15.02.2020
శిక్షణ ప్రారంభం: 01.04.2020