యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు

By Sandra Ashok KumarFirst Published Nov 27, 2019, 9:45 AM IST
Highlights

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ వివిధ పోస్టుల భర్తీకి సరైన అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ లో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌‌లైన్ విధానంలోనే దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.


పోస్టుల వివరాలు.

Latest Videos

మొత్తం ఖాళీలు: 15

also read  ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌‌లో టీచింగ్ పోస్టుల ఖాళీలు


పోస్టులు                                               ఖాళీలు
డిప్యూటీ రిజిస్ట్రార్‌                                  01
అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌                          01
సీనియ‌ర్ అసిస్టెంట్                              01
ప్రొఫెషనల్ అసిస్టెంట్                          01
జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్         01
లైబ్రరీ అటెండెంట్                               01
స్టెనో గ్రాఫ‌ర్‌                                           01
హిందీ టైపిస్ట్                                         01
మెస్ సూపర్‌వైజర్                                 01
ల్యాబొరేటరీ అసిస్టెంట్                         02
లైబ్రరీ అసిస్టెంట్                                  01
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్                  03
మొత్తం ఖాళీలు                                    15

 

అర్హత‌: పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. డిగ్రీ మరియు సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత‌ పొంది ఉండాలి. అలాగే తగిన అనుభ‌వం కూడా అవసరం.

వయోపరిమితి: డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుకు 50 సంవత్సరాలు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు 45 సంవత్సరాలు, సీనియర్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు 40 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 30 సంవత్సరాలలోపు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

also read  MIDHANI Jobs: మిధానీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ వెల్లడి: 22.11.2019
దరఖాస్తు సమర్పణకు చివరితేది: 30.12.2019.

చిరునామా:
Assistant Registrar,
Admistrative Building,
University of Hyderabad,
Gachibowli-500 046.
Hyderabad.

click me!