తెలంగాణ ఆర్‌టి‌సిలో ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైన వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ

By S Ashok KumarFirst Published Apr 6, 2021, 7:31 PM IST
Highlights

తెలంగాణ ఆర్‌టి‌సిలో అప్రెంటిస్‌ కింద  ఉద్యోగాల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రంగారెడ్డి  పరిధిలో పనిచేయటానికి 10వ తరగతి పాసైన వారు ధరఖాస్తు చేసుకోవటానికి అర్హులు.

తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టి‌ఎస్‌ఆర్‌టి‌సి ) రంగారెడ్డి పరిధిలో అప్రెంటిస్‌ (డీజిల్ మెకానిక్) కింద ఖాళీ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ అప్రెంటిస్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ధరఖాస్తులకు చివరితేది ఏప్రిల్‌ 8. అభ్యర్థులు మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://apprenticeshipindia.org/ చూడవచ్చు.

also read 


మొత్తం అప్రెంటిస్‌ పోస్టుల సంఖ్య: 33

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

స్టయి ఫండ్ : రూ.6,931 నుంచి రూ.7,797 చెల్లిస్తారు.

శిక్షణా వ్యవధి: 25 నెలలు ఉంటుంది. ఇందులో బేసిక్‌ ట్రెయినింగ్‌ కాలవ్యవధి 6 నెలలు, జాబ్‌ ట్రెయినింగ్‌ కాలం 19 నెలలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08 ఏప్రిల్ 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://apprenticeshipindia.org/

click me!