రాత పరీక్ష లేకుండా రైల్వే కంపెనీలో ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

Ashok Kumar   | Asianet News
Published : Mar 30, 2021, 07:38 PM IST
రాత పరీక్ష లేకుండా  రైల్వే కంపెనీలో ఉద్యోగాలు..  వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

సారాంశం

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తిగల అభ్యర్ధులు  ఏప్రిల్ 18 లోగా  ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 ఇండియన్ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా  వర్క్స్ ఇంజనీర్ పోస్టులని  భర్తీ చేయనుంది. సివిల్, ఎస్ అండ్ టీ విభాగాల్లో  మొత్తం 74  పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 18 దరఖాస్తులు చేసుకోవటనికి  చివరి తేదీ.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం  https://ircon.org/ అధికారిక  వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అలాగే  అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆన్‌లైన్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు- 74 ఇందులో వర్క్స్ ఇంజనీర్ సివిల్- 60, వర్క్స్ ఇంజనీర్ ఎస్ అండ్ టీ- 14 ఉన్నాయి

 ఆర్హతలు: సివిల్ ఇంజనీర్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. సివిల్ కన్‌స్ట్రక్షన్స్ వర్క్స్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. 

also read నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఉద్యోగ మేళా.. వివరాల కోసం క్లిక్ చేయండి.. ...

వర్క్స్ ఇంజనీర్ ఎస్ అండ్ టీ పోస్టుకు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. రైల్వే సిగ్నలింగ్ వర్క్స్ లేదా ఓఎఫ్‌సీ బేస్డ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్‌లో ఏడాది అనుభవం ఉండాలి.

వయస్సు: అభ్యర్థులకు 30 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులను 1:7 ప్రకారం కేటగిరీ వారీగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్, మార్కులు, అనుభవం లాంటివి పరిగణలోకి తీసుకొని వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
వేతనం: రూ.36,000.
దరఖాస్తు ప్రారంభం: 23 మార్చి 2021
దరఖాస్తుకు చివరి తేదీ: 18 ఏప్రిల్ 2021
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
 DGM/HRM, Ircon International Ltd. 
C-4, District Centre,
 Saket, New Delhi - 110017.
వెబ్‌సైట్‌:https://ircon.org/

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Money Saving Tips : కేవలం రూ.20 వేల శాలరీతో రూ.2.5 కోట్లు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?