హైదరాబాద్ బి‌హెచ్‌ఈ‌ఎల్ లో భారీగా ఉద్యోగ అవకాశాలు.. కొద్దిరోజు అవకాశం వెంటనే దరఖాస్తు చేసుకోండీ..

Ashok Kumar   | Asianet News
Published : Apr 01, 2021, 07:11 PM IST
హైదరాబాద్  బి‌హెచ్‌ఈ‌ఎల్ లో భారీగా  ఉద్యోగ అవకాశాలు.. కొద్దిరోజు అవకాశం వెంటనే దరఖాస్తు చేసుకోండీ..

సారాంశం

ఐ‌టి‌ఐ చేసిన నిరుద్యోగుల కోసం బి‌హెచ్‌ఈ‌ఎల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక ఏడాది కాలపరిమితితో  అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగం సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌  విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌ ద్వారా  దరఖాస్తు చేసుకొవచ్చు. అయితే ఈ పోస్టులను ఏడాది కాలపరిమితికి మాత్రమే భర్తీ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రనికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఏప్రిల్‌ 11 దరఖాస్తులకు చేసుకోవడానికి చివరితేది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లు https://apprenticeshipindia.org/ లేదా https://hpep.bhel.com/ చూడవచ్చు. ఏడాది కాలపరిమితికి మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం  ఉన్న 130 ఖాళీలలో ఫిట్టర్-‌ 58, ఎలక్ట్రీషియన్-‌ 18, మెషినిస్ట్-‌ 16, మెషినిస్ట్‌ గ్రైండర్-‌ 3, టర్నర్-‌ 15, వెల్డర్-‌ 11, కార్పెంటర్‌- 2, ఫౌండ్రీ మ్యాన్-‌ 2, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్-‌ 2, ఎలక్ట్రానిక్‌ మెకానిక్-‌ 2, డీజిల్‌ మెకానిక్‌- 1, మోటార్‌ మెకానిక్-‌ 1, మెకానిక్‌ ఆర్‌ అండ్ ఏసీ- 1

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 2018 తర్వాత ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

also read రాత పరీక్ష లేకుండా రైల్వే కంపెనీలో ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

వయసు: అభ్యర్థులు 1 మార్చి 2021 నాటికి 27 ఏళ్లలోపువారై ఉండాలి.

వయోపరిమితి: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: 11  ఏప్రిల్‌ 2021

 అధికారిక వెబ్‌సైట్‌: https://apprenticeshipindia.org/ లేదా https://hpep.bhel.com/

PREV
click me!

Recommended Stories

Bank Jobs : యువతకు సూపర్ ఛాన్స్.. రూ.93,960 జీతంతో మెనేజర్ స్థాయి ఉద్యోగాలు
BHEL Recruitment : కేవలం ఐటిఐ చేసుంటే చాలు.. ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు