10వ తరగతి అర్హతతో తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులు.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

By asianet news teluguFirst Published Jul 9, 2021, 8:53 PM IST
Highlights

తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  జులై 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హత, ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జులై 15 తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://mis.tgwdcw.in/ చూడవచ్చు.

Latest Videos


మొత్తం ఖాళీలు: 135
అంగన్‌వాడీ టీచర్లు - 36, అంగన్‌వాడీ ఆయాలు - 83, మినీ అంగన్‌వాడీ టీచర్లు - 16

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సదరు అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి. అంతేకాదు స్థానికంగా గ్రామం అయితే గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణం అయితే స్థానిక మున్సిపాలిటీ వార్డులో నివసిస్తూ ఉండాలి.

వయస్సు : 35 ఏళ్ళు మించకూడదు.

వేతనం: నెలకు రూ. 15,000 – 45,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 15 జులై 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://mis.tgwdcw.in/

click me!