డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందులో పీహెచ్‌పీ డెవలపర్, సీనియర్ డెవలపర్ అనలిటిక్స్, డిజైనర్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
undefined
1 జులై దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.dic.gov.in/లో చూడవచ్చు.
మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య 16 వీటిలో సీనియర్ డెవలపర్- 3, డెవలపర్- 6, సాఫ్ట్‌వేర్ టెస్టర్, కమ్ డెవలపర్- 2, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 1, కంటెంట్ మేనేజర్ లేదా రైటర్- 2, డిజైనర్- 2
also read
అర్హతలు: డిజైనర్, కంటెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులకు బీఈ లేదా ఎంఎస్‌సి లేదా ఎంసీఏ చేసి ఉండాలి. అలాగే అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 1 జూలై 2021
అధికారిక వెబ్‌సైట్: https://www.meity.gov.in/ లేదా https://negd.gov.in/