నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వ తరగతి అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లయ్ చేసుకోండీ

By asianet news telugu  |  First Published Aug 26, 2021, 5:11 PM IST

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా  25,271 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే  ఈ పోస్టులకు అభ్యర్ధులు  ఆన్ లైన్  విధానంలో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 


ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు  శుభవార్త.  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 25,271 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో పురుష అభ్యర్థులకు 22,424 పోస్టులు, మహిళలకు 2847 పోస్టులు కేటాయించారు.

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌సీ‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Latest Videos

undefined

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ssc.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.  అలాగే  వెబ్‌సైట్‌లోనే ఆన్ లైన్  విధానంలో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 25, 271

బి‌ఎస్‌ఎఫ్ - 7545

also read కామర్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రష్యాలో ఉద్యోగావకాశాలు!

సి‌ఐ‌ఎస్‌ఎఫ్- 8464

ఎస్‌ఎస్‌బి - 3806

ఐ‌టి‌బి‌పి- 1431

ఏ‌ఆర్ - 3785

ఎస్‌ఎస్‌ఎఫ్- 240

అర్హత: 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ  పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (Online Written Examination), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Standards Test)‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination)ల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

 కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి. పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

click me!