తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం తాజాగా హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ జోన్-1, మల్టీ జోన్-2లో నియామకం చేపట్టనున్నారు.
పోలీసు ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి శుభవార్త. తాజాగా తెలంగాణలోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చివరితేదిని సెప్టెంబర్ 4. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.tslprb.in/ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
undefined
వయో పరిమితి : రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కేటగిరీ-7) ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిలో పదేళ్ల సడలింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు అనుగుణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే చివరితేదిని సెప్టెంబర్ 4 వరకు పొడిగించినట్లు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ పీవీ శ్రీనివాసరావు తెలిపారు.
మొత్తం పోస్టులు: 151 పోస్టులు ఇందులో మల్టీ జోన్-1లో 68 పోస్టులు, మల్టీ జోన్-2లో 83 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎల్ఎల్బీ లేదా బీఎల్ పూర్తిచేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం ఉండాలి.
also read ఆగష్టు 25న భారీ జాబ్ మేళా.. 10th అర్హత ఉన్నవారు కూడా హాజరుకావొచ్చు.. జీతం ఎంతంటే ?
వయసు: అభ్యర్థులు 1 జూలై 2021 నాటికి 34 ఏళ్ల లోపు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దీనికి మొత్తం 100 మార్కులు.
జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 750గా నిర్ణయించారు.
అధికారిక వెబ్సైట్: https://www.tslprb.in/