SSC CHSL 2021-22: ఇంట‌ర్ అర్హ‌త‌తో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలివే..!

By team teluguFirst Published Feb 2, 2022, 11:35 AM IST
Highlights

స్టాఫ్ సెలెక్ష‌న్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ ఎస్‌ఎస్‌సీ అధికారిక అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.nic.in/ లో విడుదలైంది. ఖాళీల వివరాలను త్వరలో విడుదల చేస్తారు.

స్టాఫ్ సెలెక్ష‌న్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.nic.in/ లో విడుదలైంది. ఖాళీల వివరాలను త్వరలో విడుదల చేస్తారు.

ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ (10+2) ఎగ్జామ్‌ 2021
- ఎల్‌డీసీ/ జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్‌
- పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌
- డేటా ఎంట్రీ ఆపరేటర్‌

అర్హ‌త‌లు: ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 12వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. పరీక్షలో నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌ -1, టైర్‌-2), స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌ (టైర్‌-3) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.100.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 1, 2022
దరఖాస్తులకు చివరితేది: మార్చి 7, 2022
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: మార్చి 8, 2022
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌-1): మే, 2022
టైర్‌-2 పరీక్ష (డిస్క్రిప్టివ్‌ పరీక్ష): త్వరలో ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

click me!