MDL Recruitment 2022: ప‌ది పాసైన విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. 1501 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

By team teluguFirst Published Jan 30, 2022, 4:42 PM IST
Highlights

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
 
- భర్తీ చేయనున్న పోస్టులు: నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు: 1501
- పోస్టుల వివరాలు: ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, కంప్రెసర్ అటెండెంట్, బ్రాస్ ఫినిషర్, కంపోజిట్ వెల్డర్, ఎలక్ట్రికల్ క్రేన్ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, జూనియర్ క్యూసీ ఇన్‌స్పెక్టర్, జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్, ప్లానర్ ఎస్టిమేటర్, గ్యాస్ కట్టర్, స్టోర్స్ కీపర్, ఫైర్ ఫైటర్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్.. ఇతర పోస్టులు.
 
- వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
- అర్హతలు: పదో తరగతితోపాటు, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి.
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
- పరీక్ష విధానం: మొత్తం 30 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. జీకే నుంచి 10 ప్రశ్నలు, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు, టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశ్నల చొప్పున 30 ప్రశ్నలకు 30 మార్కులకు ఉంటాయి.
- రాత పరీక్ష తేదీ: మార్చి 15, 2022.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- దరఖాస్తులకు చివరితేదీ: 8 ఫిబ్రవరి 2022
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌
 

click me!