సికింద్రాబాద్-సౌత్ సెంట్రల్ రైల్వేలో మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాలాగూడలోని రైల్వే హాస్పిటల్‌లో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్)లో పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాలాగూడలోని రైల్వే హాస్పిటల్‌లో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.
ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, హాస్పిటల్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. మే 15 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు మరింత సమాచారం కోసం https://scr.indianrailways.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
undefined
మొత్తం ఖాళీ పోస్టులు: 40
నర్సింగ్ సూపరింటెండెంట్- 16
ల్యాబ్ అసిస్టెంట్- 4
హాస్పిటల్ అటెండెంట్- 20
also read 10వ తరగతి తరువాత ఏ కోర్సు బెస్ట్.. మంచి ఉద్యోగం, జీతం పొందాలంటే ఏం చెయ్యాలి ? ...
అర్హత: జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (జీఎన్ఎం) లేదా బీఎస్‌సి (నర్సింగ్), సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా, పదో తరగతి లేదా ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 1 ఏప్రిల్ 2021 నాటికి 18 నుంచి 54 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు నర్సింగ్ సూపరింటెండ్‌కు రూ.44,900, ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.21,700, హాస్పిటల్ అటెండెంట్‌కు రూ. 18 వేలు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 15 మే 2021
అధికారిక వెబ్‌సైట్:https://scr.indianrailways.gov.in/