Bank Jobs: ప్రభుత్వ బ్యాంకు SBIలో ఉద్యోగాలు.. 3వేల పోస్టులు భర్తీ

Published : May 12, 2025, 07:07 PM IST
Bank Jobs: ప్రభుత్వ బ్యాంకు SBIలో ఉద్యోగాలు.. 3వేల పోస్టులు భర్తీ

సారాంశం

ఎస్‌బిఐ 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు మే 9 నుంmr మే 29, 2025 వరకు sbi.co.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? మీకోసమే ఈ గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా మే 29, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) లేదా మెడికల్, ఇంజనీరింగ్, సీఏ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులే.

వయస్సు

దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (1 మే 1995 - 30 ఏప్రిల్ 2004). దరఖాస్తు చేసే సర్కిల్ ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. 

ఎంపిక ఎలా?

ఆన్‌లైన్ పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది:

ఆబ్జెక్టివ్ టెస్ట్ (120 మార్కులు, 2 గంటలు)

డిస్క్రిప్టివ్ టెస్ట్ (50 మార్కులు, 30 నిమిషాలు)

ఆబ్జెక్టివ్ టెస్ట్ 4 సెక్షన్లుగా ఉంటుంది, ప్రతి సెక్షన్‌కి ప్రత్యేక సమయం ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో ఇంగ్లీష్‌లో ఎస్సే, లెటర్ రాయాలి.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ, EWS కేటగిరీలకు ₹750/-, SC, ST, PwBD లకు ఫీజు లేదు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. sbi.co.in లో పూర్తి వివరాలు చూడండి.

ఎస్‌బిఐ సిబిఓ నోటిఫికేషన్

దరఖాస్తు లింక్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇంజనీరింగ్ అవసరం లేదు.. టెన్త్, ఇంటర్ చదివినా లక్షల జీతంతో సాప్ట్ వేర్ జాబ్స్..!
నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్