స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి సరైన అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి, గేట్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా లేదా ఏదైనా ఎస్‌బీఐ శాఖలో చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు.
also read PGCIL Notification: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల
పోస్టుల వివరాలు.
మేనేజ్‌మెంట్ ట్రైనీ: 399 పోస్టులు
పోస్టుల కేటాయింపు.
విభాగం జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్
పోస్టులు(399) 162 106 59 34 39
విభాగాల వారీగా ఖాళీలు
విభాగం పోస్టులు
మెకానికల్ 156
మెటలర్జికల్ 67
ఎలక్ట్రికల్ 91
కెమికల్ 30
ఇన్‌స్ట్రుమెంటేషన్ 36
మైనింగ్ 19
మొత్తం ఖాళీలు 399
also read Navy Jobs: విశాఖ నేవల్ డాక్‌యార్డులో 275 పోస్టుల ఖాళీలు
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ. గేట్-2019 ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 14.06.2019 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: గేట్-2019 స్కోరు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.12.2019.