సెంట్రల్ రైల్వేలో 432 అప్రెంటిస్ పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

By Sandra Ashok KumarFirst Published Aug 13, 2020, 5:26 PM IST
Highlights

అర్హతగల అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ ఇండియా.ఓ‌ఆర్‌జిలోని అప్రెంటిస్ జాబ్ పోర్టల్ అధికారిక సైట్ ద్వారా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలో 432 పోస్టులను భర్తీ చేస్తుంది.


సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హతగల అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ ఇండియా.ఓ‌ఆర్‌జిలోని అప్రెంటిస్ జాబ్ పోర్టల్ అధికారిక సైట్ ద్వారా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలో 432 పోస్టులను భర్తీ చేస్తుంది. ట్రేడ్ అప్రెంటిస్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్ పూర్ డివిజన్ లోనివి. 

అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల: 

రైల్వే రిక్రూట్మెంట్ 2020 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 1, 2020
దరఖాస్తు ముగింపు తేదీ: ఆగస్టు 30

రైల్వే రిక్రూట్మెంట్ 2020 అర్హత: ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఎన్‌సివిటి సర్టిఫికెట్‌తో 10వ తరగతి (హైస్కూల్) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 15 సంవత్సరాలు నుండి గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు ఉండాలి. 

రైల్వే రిక్రూట్మెంట్ 2020 అప్రెంటిస్ వ్యవాధి
ఎంపికైన అభ్యర్థులు అప్రెంటిస్‌లుగా ఉంటారు. వారు ప్రతి ట్రేడ్ లో 1 సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందుతారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి శిక్షణ సమయంలో వారికి స్టైఫండ్ చెల్లిస్తారు. వారి అప్రెంటిస్‌షిప్ పూర్తయిన తర్వాత వారి శిక్షణ ఆపివేయబడుతుంది.

రైల్వే రిక్రూట్మెంట్ 2020 ఇతర వివరాలు
ఎంపికైన అభ్యర్థులు లేదా, ఒకవేళ మైనర్ అయితే అతని సంరక్షకుడు యజమానితో అప్రెంటిస్ షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే  అధికారిక సైట్ సందర్శించవచ్చు.

అధికారిక వెబ్ సైట్ కోసం క్లిక్ చేయండి
 

click me!