దేశంలో ఉన్న నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థలలో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వేల మంది ఫ్రెషర్లు(కొత్తవారిని) నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
బెంగళూరు: కరోనా వైరస్ సంక్షోభంలో ఉద్యోగాలకు భరోసా లేకుండా పోతుంది. కొత్తగా ఉద్యోగాలు ప్రకటించే అవకాశం కూడా లేదు.
కానీ, దేశంలో ఉన్న నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థలలో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వేల మంది ఫ్రెషర్లు(కొత్తవారిని) నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
also read
గతేడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా 9 వేల మంది సిబ్బందిని నియమించుకోగా, ఈ ఏడాది మాత్రం దీనికి అదనంగా మరో 6 వేల మందిని తీసుకోనున్నట్లు కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ అప్పారావు తెలిపారు.
ఈ నియామకాలను కేవలం వర్చువల్ ద్వారా ఎంపిక చేసుకోనున్నట్లు చెప్పారు. వీరికి అన్న్యువల్ పాకేజ్ వేతనంగా రూ.3.5 లక్షలుగా నిర్ణయించింది.