గోల్కొండ‌ ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు

By Sandra Ashok Kumar  |  First Published Nov 13, 2019, 6:03 PM IST

గోల్కొండ‌ ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ పోస్టులకు తగిన విద్యార్హతగల అభ్యర్ధులు అప్లై చేసుకోగలరు.మొత్తం టీచింగ్ పోస్టుల  భ‌ర్తీ సంఖ్య 32.


హైద‌రాబాద్‌‌లోని గోల్కొండ‌ ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ పోస్టులకుగాను విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఈ మెయిల్ ద్వారా తమ రెజ్యూమ్ పంపాల్సి ఉంటుంది. మొత్తం టీచింగ్ పోస్టుల  భ‌ర్తీ సంఖ్య 32.


పోస్టుల భ‌ర్తీ వివ‌రాలు....

Latest Videos

undefined

* టీచింగ్ పోస్టుల సంఖ్య: 32

విభాగాల వారీగా ఖాళీలు..

also read ఎస్‌ఎస్‌సి ( మల్టీ టాస్కింగ్ స్టాఫ్) 7,099 ఖాళీలను ప్రకటించింది

➦ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 03

సబ్జెక్టులు: కెమిస్ట్రీ-01, హిస్టరీ-01, ఫిజికల్ ఎడ్యుకేషన్-01.

➦ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ): 12

 ప్రైమ‌రీ టీచ‌ర్లు(పీఆర్‌టీ): 15

సబ్జెక్టులు: అన్ని సబ్జెక్టులు-14, మ్యూజిక్ (వెస్టర్న్)-01.

➦ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ట్రైన‌ర్(పీఈటీ): 02

అర్హత‌: పోస్టులవారీగా విద్యార్హతలను నిర్ణయించారు. ఆయా సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటెట్‌/టెట్ అర్హత‌ పొంది ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 

aslo read civil service jobs: సివిల్ సర్వీసెస్ 2019 నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు ప్రింట్ స్కానింగ్ కాపీకి ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను జతచేసి ఈమెయిల్ ద్వారా పంపాలి.
సబ్జెక్టులు: ఇంగ్లిష్-02, హిందీ-01, మ్యాథ్స్-03, కంప్యూటర్ సైన్స్-01, సోషల్ స్టడీస్-03, ఫిజిక్స్-01, కెమిస్ట్రీ-01.


ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. డిమాండ్ డ్రాఫ్ట్ (డిడి), చలానా రూపంలో ఫీజు చెల్లించాలి.

చివ‌రితేది: 30.11.2019.

ఈమెయిల్: info.apsgolconda@gmail.com

click me!