దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఊన్నాయి. ఇందులో హైదరాబాద్ నగరంలో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఈ ఉద్యోగ నియమకాలు చేపట్టనున్నారు.
ఈసిఐఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసిఐఎల్) హైదరాబాద్ లో 17 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి దరఖాస్తులని ఆహ్వానిస్తున్నది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఊన్నాయి.
ఇందులో హైదరాబాద్ నగరంలో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఈ ఉద్యోగ నియమకాలు చేపట్టనున్నారు.
undefined
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 30 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య- 17
హైదరాబాద్- 9, దుర్గాపూర్- 2, కొచ్చిన్- 1, ముంద్రా- 1, ముంబై- 2, చండీగఢ్- 1, చెన్నై- 1
విద్యార్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ లేదా బీఈలో పాసై ఉండాలి.
జీతం: నెలకు రూ.23 వేలు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేది: సెప్టెంబర్ 18, 2020
దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2020
వయస్సు: 2020 ఆగస్ట్ 31 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు కల్పించారు.
ఎంపిక చేసే విధానం: బీటెక్ లేదా బీఈలో వచ్చిన మార్కుల ఆధారంగా దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్:http://careers.ecil.co.in/ చూడండి.