న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు...వెంటనే అప్లై చేసుకోండీ.

By Sandra Ashok Kumar  |  First Published Jan 23, 2020, 11:10 AM IST

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 


భారతదేశంలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పతోతరగతి, ఇంటర్, డిప్లొమా అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఉన్న మొత్తం ఖాళీల 102.

పోస్టుల భర్తీ వివరాలు

Latest Videos

undefined

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-56

టెక్నీషియన్‌-46

1. విభాగాల వారీగా సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఖాళీలు

ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 06

 సివిల్‌: 22

also read హైదరదాబాద్‌లోని ఈఎస్‌ఐలో ఉద్యోగాలు...అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి.

 మెకానికల్‌: 21

 ఎలక్ట్రికల్‌: 07


అర్హత: పదోతరగతి తర్వాత సంబంధిత బ్రాంచీలో మూడు సంవత్సరాల పాటు డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన కోర్సు లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 31.01.2020 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

జీతం: రూ.35,400 (లెవల్‌-6 ప్రకారం).

2. విభాగాల వారీగా టెక్నీషియన్‌ పోస్టుల ఖాళీలు

 సర్వేయర్‌: 12

డ్రాఫ్ట్స్‌మెన్‌: 01

 టర్నర్‌/మెషినిస్ట్‌: 19

also read AP Jobs : గ్రామ సచివాలయాల్లో 762 ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ...

 ఎలక్ట్రీషియన్‌/వైర్‌మెన్‌: 07

 ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌: 07


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పదోతరగతి లేదా ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి.


వయోపరిమితి: 31.01.2020 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.


జీతం: రూ.21,700 (లెవల్‌-3 ప్రకారం).


దరఖాస్తు విధానం: సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

​ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 15.01.2020 చివరితేది: 31.01.2020

https://npcilcareers.co.in/MainSite/default.aspx

click me!