మిధానీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్, ఇతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.
మొత్తం ఖాళీలు: 27
undefined
1) అసిస్టెంట్ మేనేజర్: 02
విభాగాలు: ఐటీ ERP-టెక్నికల్-01, రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్-01.
అర్హత: బీఈ/బీటెక్/ ఎంసీఏ. సంబంధిత విభాగంలో తగిన అనుభవం ఉండాలి.
2) డిప్యూటీ మేనేజర్ (సివిల్): 01
అర్హత: బీఈ/బీటెక్/ ఎంఈ/ఎంటెక్. సంబంధిత విభాగంలో తగిన అనుభవం ఉండాలి.
also read ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2019 నోటిఫికేషన్ విడుదల
3) మేనేజర్: 05
విభాగాలు: సివిల్-01, హెచ్‌ఆర్-01, స్పెషల్ స్టీల్స్-01, సూపర్ అలాయ్స్-01, టైటానియం అలాయ్స్-01,
అర్హత: బీఈ/బీటెక్/ ఎంబీఏ/ఎంఏ(పీఎం). సంబంధిత విభాగంలో తగిన అనుభవం ఉండాలి.
4) చార్జర్ ఆపరేటర్లు: 03
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. సంబంధిత విభాగంలో తగిన అనుభవం ఉండాలి.
5) జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ: 03
విభాగాలు: ఎలక్ట్రికల్-01, ఇన్‌స్ట్రుమెంటేషన్-02.
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
also read Indian navy jobs:ఇండియన్ నేవీ ఆఫీసర్ 2019 నోటిఫికేషన్ విడుదల.
6) లేడిల్‌మ్యాన్: 02
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
7) సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ: 11
విభాగాలు: ఇన్‌స్ట్రుమెంటేషన్-03, మెల్ట్స్-06, పిక్లింగ్ షాప్-02.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100
చివరితేది: 14.12.2019.