మహారాష్ట్ర పోలీస్ ఖాళీలు 2019-20కు వెలువడింది. ఆసక్తి గల అభ్యర్థులు మహారాష్ట్ర పోలీసుల అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ mahapariksha.gov.in లేదా mahapolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుళ్ పోస్టుల ఖాళీలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుళ్ పోస్టులకు అర్హత గల అభ్యర్డులు దరఖాస్తు చేసుకువలని తెలిపింది. నోటిఫికేషన్ ఖాళీలలో జిల్లా పోలీస్, రైల్వే పోలీస్, SRPF లో అర్మేడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు మహారాష్ట్ర పోలీసుల అధికారిక వెబ్‌సైట్ ద్వారా mahapariksha.gov.in లేదా mahapolice.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
undefined
also read మెట్రోలో 1492 ఉద్యోగాలు....రేపే ఉద్యోగ ప్రకటన
మహారాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 1847
జిల్లా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ మరియు రైల్వే పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ ఖాళీలు: 1019
ఎస్‌ఆర్‌పిఎఫ్ ఆర్మడ్ పోలీసు కానిస్టేబుల్‌లో ఖాళీలు: 828
నియామక ప్రక్రియ కోసం నమోదు ప్రారంభ తేదీ: డిసెంబర్ 2, 2019 (7 PM)
రిజిస్ట్రేషన్ ఫారం సమర్పించాల్సిన చివరి తేదీ: జనవరి 8, 2020 (11:59 PM)
వయోపరిమితి: పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్‌ఆర్‌పిఎఫ్ పోస్టుల్లో దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ఉన్నత వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలించబడుతుంది.
విద్యా అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన రాష్ట్రం లేదా కేంద్ర బోర్డు నుండి 12 వ తరగతి పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
also read Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు...
మహారాష్ట్ర పోలీసు ఉద్యోగా దరఖాస్తు విధానం:
1: mahapariksha.gov.in వద్ద మహారాష్ట్ర పోలీసుల అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
2: వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి
3: మీకు పేరు, పాస్‌వర్డ్ లేకపోతే, ముందుగా నమోదు చేసుకోండి
4: సంబంధిత పూర్తి వివరాలను ఫామ్ లో నింపండి
5: సబ్మిట్ పై క్లిక్ చేయండి
6: అప్లై చేశాక ప్రింట్ అవుట్ తీసుకోండి
దరఖాస్తు రుసుము
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 450 రూపాయలు, రిజర్వు చేసిన కేటగిరీ అభ్యర్థులకు 350 రూపాయలు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా యుపిఐ ఐడి ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
ఖాళీల గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడండి.