గ్రామీణ డాక్ సేవక్ నియామకం కోసం ఇండియా పోస్ట్ దరఖాస్తు ఆహ్వానిస్తున్నది. ఇందులో మొత్తం 3650 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. నియామకాలకు అందుబాటులో ఉన్న పోస్టులలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ ఉన్నాయి. దీనికి ఎంపిక మెరిట్ ఆధారితంగా ఉంటుంది.
న్యూ ఢిల్లీ : మహారాష్ట్ర సర్కిల్‌కు గ్రామీణ డాక్ సేవక్ నియామకానికి ఇండియా పోస్ట్ దరఖాస్తు స్వీకరిస్తున్నది. ఇందులో మొత్తం 3650 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. నియామకాలకు అందుబాటులో ఉన్న పోస్టులలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ ఉన్నాయి. దీనికి ఎంపిక మెరిట్ ఆధారితంగా ఉంటుంది.
"ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్ధుల ఎంపిక చేయబడుతుంది. "ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ 2019 నవంబర్ 30న ముగుస్తుంది. దరఖాస్తుదారులు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ లేదా గణితం, ఇంగ్లీషులో ఉత్తీర్ణత సాధించి 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
undefined
also read గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల.
అభ్యర్థి కనీసం 10 వ తరగతి వరకు స్థానిక భాషను కూడా చదివి ఉండాలి.దరఖాస్తుదారులు 18-40 ఏళ్లలోపు ఉండాలి. ఉన్నత వయోపరిమితిని ఓబిసి వర్గానికి చెందిన వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారికి 5 సంవత్సరాలు సడలింపును ఇస్తారు.
పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి గుర్తింపు పొందిన కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 రోజులు ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ పొందినట్టు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం / రాష్ట్ర ప్రభుత్వం / విశ్వవిద్యాలయం / బోర్డులకు సంబంధించిన కంప్యూటర్ శిక్షణ ధృవపత్రాలు కూడా అంగీకరించబడతాయి.
also read 496 కానిస్టేబుల్ ఖాళీలను ప్రకటించిన పోలీస్ రిక్రూట్‌మెంట్
పదవ తరగతి లేదా పన్నెండో తరగతిలో కంప్యూటర్‌ను ఒక సబ్జెక్టుగా చదివిన లేదా ఉన్నత విద్యా అర్హత పొందిన అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ యొక్క ఈ అవసరం సడలించబడుతుంది.