IDBI bank jobs: ఐడీబీఐ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల

By Sandra Ashok Kumar  |  First Published Nov 29, 2019, 10:21 AM IST

ఐడీబీఐ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీల సంఖ్య: 61


ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


నోటిఫికేషన్  వివరాలు.

Latest Videos

undefined

మొత్తం ఖాళీల సంఖ్య: 61

పోస్టులు                                                                     ఖాళీలు
డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) (గ్రేడ్-డి)                02
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) (గ్రేడ్-సి)             05
మేనేజర్ (గ్రేడ్-బి)                                                          54
మొత్తం ఖాళీలు                                                             61


పోస్టుల కేటాయింపు: జనరల్-28, ఎస్సీ-09, ఎస్టీ-04, ఓబీసీ-15, ఈడబ్ల్యూఎస్-05.

also read  SAIL jobs: సెయిల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల ఖాళీలు


విభాగాల వారీగా ఖాళీలు.

 అగ్రికల్చర్ ఆఫీసర్ (గ్రేడ్-బి): 40

అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ.

అనుభవం: బ్యాంక్ ఆఫీసర్‌గా కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో అగ్రికల్చర్ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.11.2019 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


ఫ్యాకల్టీ-బిహేవియరల్ సైన్సెస్ (గ్రేడ్-డి): 01

అర్హత: పీజీ డిగ్రీ (సైకాలజీ/బిహేవియరల్ సైన్సెస్)/ ఎంబీఏ (హెచ్ఆర్‌ఎమ్). పీహెచ్‌డీ/ఫెలో ప్రోగామ్ (ఇండస్ట్రియల్ సైకాలజీ/ సైకాలజీ/హెచ్‌ఆర్‌ఎం/ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్).

అనుభవం: సంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.11.2019 నాటికి 35 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్-ఫ్రాడ్ అనలిస్ట్(మేకర్) (గ్రేడ్-బి): 14

అర్హత: 60 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీ. సీఏ/ఎంబీఏ/సీఏఐఐబీ/ జేఏఐఐబీ

అనుభవం: బ్యాంక్ ఆఫీసర్‌గా కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.11.2019 నాటికి 35 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఇన్వెస్టిగేటర్) (గ్రేడ్-సి): 05

అర్హత: 60 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీ. సీఏ/ఎంబీఏ/సీఏఐఐబీ/ జేఏఐఐబీ/ సీఎఫ్‌ఈ (సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్) ఉండాలి.

అనుభవం: బ్యాంక్ ఉద్యోగిగా కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.11.2019 నాటికి 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

also reaad  PGCIL Notification: ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల

 

 ట్రాన్సాక్షన్ మానిటరింగ్ టీమ్ హెడ్ (గ్రేడ్-డి): 01

అర్హత: సీఏ/ఎంబీఏ/డిగ్రీతోపాటు సీఎఫ్‌ఈ (సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్). సీఏఐఐబీ/ జేఏఐఐబీ ఉండాలి.

అనుభవం: బ్యాంక్ ఉద్యోగిగా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.11.2019 నాటికి 35 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 (ఇంటిమేషన్ ఛార్జీలు), ఇతరులు రూ.700 (ఇంటిమేషన్+అప్లికేషన్ ఫీజు) ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.


ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 28.11.2019

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.12.2019

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 27.12.2019
 

click me!