ఇంజనీరింగ్ పాసయ్యారా, అయితే పరీక్ష రాయకుండానే, కేవలం ఇంటర్వ్యూతో ఇస్రోలో ఉద్యోగం పొందే అవకాశం..

By Krishna Adithya  |  First Published Dec 3, 2022, 1:00 AM IST

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ల నుంచి ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.


దేశంలోని లక్షలాది మంది అభ్యర్థులు ఇస్రోలో ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. అనేకమంది ఇస్రో చేసే రిక్రూట్‌మెంట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఇస్రో కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన రిక్రూట్‌మెంట్ గురించిన మొత్తం సమాచారాన్ని తనిఖీ చేసి, సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ఖాళీలను ప్రకటించింది. మొత్తం 68 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఇస్రోలో పని చేయాలనుకునే ఔత్సాహికులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భారత ప్రభుత్వ రక్షణ శాఖ కింద పనిచేస్తున్న ఇస్రో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 19.12.2022

Latest Videos

undefined

సైంటిస్ట్/ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)
ఖాళీల సంఖ్య - 21
విద్యార్హత: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో BE/ B.Tech పూర్తి చేసి ఉండాలి.

సైంటిస్ట్/ఇంజనీర్ (మెకానికల్)
ఖాళీల సంఖ్య - 33
విద్యార్హత: మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

సైంటిస్ట్/ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్)
ఖాళీల సంఖ్య - 14
విద్యార్హత: బీఈ/ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు అర్హత : 19.12.2022 నాటికి 28 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : ఈ పోస్టులకు గాట్ మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆపై అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి: ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి www.isro.gov.in/Careers.html వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 19.12.2022

దరఖాస్తు రుసుము: రూ. 250, అయితే SC/ST, మహిళలు, వికలాంగులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

మరిన్ని వివరాల కోసం www.isro.gov.in/media_isro/pdf/recruitmentNotice/2022_Nov/Advt_Sci_EngrSC_EMC_BILINGUAL.pdf వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ను సందర్శించండి

click me!