గతంలో ఏపీ ప్రభుత్వం 560 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 50 మార్కులకు గాను 45 మార్కులకు నిర్వహించిన రాత పరీక్షకు 21,000 మంది హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఏపీ ప్రభుత్వం 560 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 50 మార్కులకు గాను 45 మార్కులకు నిర్వహించిన రాత పరీక్షకు 21,000 మంది హాజరయ్యారు.
మిగిలిన 5 మార్కులకు స్పోకెన్ ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. వీరిలో స్పోకెన్ ఇంగ్లిష్ పరీక్షకు 1:2 రేషియోలో 1,194 మంది ఎంపికయ్యారు. ఒక్కొక్కరు 3 నుంచి 5 నిమిషాల నిడివి ఉన్న స్పోకెన్ ఇంగ్లిష్ వీడియోలను రికార్డ్ చేసిన తర్వాత చాలా మంది వీడియోలను చూడటం కష్టమని అధికారులు భావించారు.
undefined
మెరిట్ లిస్ట్ లో ఉన్నవారు మాత్రమే స్పోకెన్ ఇంగ్లిష్ వీడియోలను అప్ లోడ్ చేయాలని సూచించడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. దీంతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఫలితాల ప్రకటనపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు.. స్టే ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. వీటి ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి.