UPSC Jobs: యూ‌పి‌సి‌ఎస్ నోటిఫికేషన్ విడుదల... ఇంజినీరింగ్ అర్హత

By Sandra Ashok KumarFirst Published Dec 31, 2019, 3:34 PM IST
Highlights

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ విభాగాల్లో డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ విభాగాల్లో డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత పొందిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.మొత్తం ఖాళీల సంఖ్య 29.

also read IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు


నోటిఫికేషన్ వివ‌రాలు: డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌  02, డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీస‌ర్ (టెక్నికల్)  27

1. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌ పోస్టులు సంఖ్య: 02

విభాగం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఉమెన్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్), హోం మంత్రిత్వశాఖ.

అర్హ‌త‌: డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు మాస్టర్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్) లేదా బీఈ/ బీటెక్ (కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ) అర్హత పొంది ఉండాలి.


2. డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీస‌ర్ పోస్టులు సంఖ్య: 27

విభాగం: ఇంటెలిజెన్స్‌ బ్యూరో, హోం మంత్రిత్వశాఖ.

అర్హ‌త‌: డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీస‌ర్ ఉద్యోగాలకు బీఈ/ బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్) అర్హత పొంది ఉండాలి. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ ఐటీ స్పెషలైజేషన్ ఉండాలి.

 డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునే వారు 30 సంవత్సరాలలోపు వారై ఉండాలి.

 డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీస‌ర్ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునే వారు 35 సంవత్సరాలలోపు వారై ఉండాలి.

also read Bank Jobs: ఆర్‌బి‌ఐలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు....


ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలీ. ఎస్‌‌బీఐలో క్యాష్ రూపంలో లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా ఫీజు  చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలిగించారు.

 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.01.2020.

 దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 17.01.2020.

click me!