Bank Jobs: ఆర్‌బి‌ఐలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు....

Ashok Kumar   | Asianet News
Published : Dec 28, 2019, 10:24 AM ISTUpdated : Dec 28, 2019, 10:27 AM IST
Bank Jobs: ఆర్‌బి‌ఐలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు....

సారాంశం

ముంబ‌యి కేంద్రంగా పనిచేస్తున్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముంబ‌యి కేంద్రంగా పనిచేస్తున్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ పోస్టుల భర్తీకి డిసెంబరు 27న నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టులకు తగిన విద్యార్హతలను ఆర్‌బి‌ఐ నిర్ణయించింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు డిసెంబరు 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20  జనవరి. మొత్తం ఖాళీల సంఖ్య 17.

also read Airforce Jobs: ఎయిర్ ఫోర్స్ లో ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు..

వివిధ పోస్టుల వివరాలు: లీగ‌ల్ ఆఫీస‌ర్‌ (గ్రేడ్-బి) 01, మేనేజ‌ర్‌ (టెక్-సివిల్) 02, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ (రాజ్‌భాషా) 08, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ (ప్రొటొకాల్ & సెక్యూరిటీ) 05, లైబ్రరీ ప్రొఫెష‌న‌ల్స్‌ (అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్-ఎ) 01,
మొత్తం పోస్టులు 17

అర్హత: పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

వయోపరిమితి: 01.12.2019 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 02.12.1989 - 01.12.1998 మధ్య జన్మించి ఉండాలి.

also read Railway Jobs: సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల...మొత్తం 2,562 ఖాళీలు

ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ (డిస్క్రిప్టివ్) పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు  ప్రారంభం తేదీ 30.12.2019 చివ‌రితేది 20.01.2020. 

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్