సెంట్రల్ యూనివర్శిటీలో టీచింగ్ పోస్టులు...వెంటనే అప్లై చేసుకోండీ

By Sandra Ashok KumarFirst Published Feb 4, 2020, 3:29 PM IST
Highlights

తెలంగాణలో ఉన్న మూడు సెంట్రల్ యూనివర్శిటీలో కలిపి మొత్తం 300 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్శిటీ(EFLU)లో 317 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

హైదరాబాదు: దేశం ఉన్న పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఉన్న మూడు సెంట్రల్ యూనివర్శిటీలో కలిపి మొత్తం 300 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్శిటీ(EFLU)లో 317 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.

also read వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండి...

 
ప్రొఫెసర్ పోస్టులు ఖాళీల వివరాలు 
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో 53 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 46 పోస్టులు, హెచ్‌సీయూలో 63 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు భర్తీ ఉన్నాయి.

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, ఇఫ్లూ (EFLU)లో 36, 25 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక హెదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 46 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

దేశవ్యాప్తంగా 6 వేల టీచింగ్ పోస్టుల ఖాళీలు ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే వివిధ సెంట్రల్ యూనివర్శిటీల్లో 6వేల టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 2753 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 2452 అసోసియేట్ పోస్టులు భర్తీకి ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిలిపివేయడం జరిగింది.

వివాదాస్పద 13 పాయింట్ల రోస్టర్ సిస్టం అమలు చేయాలని కేంద్రం భావించింది. అంతకుముందు 200 పాయింట్ల సిస్టంను అమలు చేసేవారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతోనే ఈ పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదని హెచ్‌సీయూ సిబ్బంది తెలిపారు.

also read విద్యార్థులకు గుడ్ న్యూస్... తగ్గనున్న కాలేజీ ఫీజులు!

 
తెలంగాణలో 1000 నాన్ టీచింగ్ పోస్టులు 
సెంట్రల్ యూనివర్శిటీల్లో పోస్టుల భర్తీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు హ్యూమన్ రిసోర్స్ మంత్రిత్వశాఖ సమాధానంగా చెప్పింది. ఇక తెలంగాణలో మూడు సెంట్రల్ యూనివర్శిటీల్లో కలిపి మొత్తం 1000 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.ఒక్క హెచ్‌సీయూలోనే 674 పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్శిటీల్లో మొత్తం 12000 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 9036 గ్రూప్ సీ పోస్టులు, 2,533 గ్రూప్ బీ పోస్టులు, 754 గ్రూప్ ఏ పోస్టులు ఉన్నాయి.
 

click me!