NPCIL‌లో 200 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు: గేట్ స్కోర్ ఉంటే ప్రాధాన్యత

Published : Apr 10, 2019, 03:28 PM IST
NPCIL‌లో 200 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు: గేట్ స్కోర్ ఉంటే ప్రాధాన్యత

సారాంశం

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 200 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 9, 2019 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.

దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 23, 2019. అభ్యర్థుల గేట్(GATE)  2019 స్కోర్స్ ఆధారంగా ఎన్‌పీసీఐఎల్ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అభ్యర్థులు అవసరమైన(వ్యాలిడ్) గేట్ స్కోర్ తోపాటు బీటెక్/బీఈ, బీఎస్సీ, ఎంఈ/ఎంటెక్ డిగ్రీ కలిగివుండాలి. 

మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్స్ సంబంధిత విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం ఎన్‌పీసీఐఎల్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గేట్ స్కోర్స్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ ఉంటుందని పేర్కొంది.

ఎన్‌పీసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 23, 2019. ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం npcilcareers.co.inను సందర్శించవచ్చు.

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్