నిరుద్యోగుల ఎదురుచూపులకు తెర... 2,528 ఉద్యోగాలకు తుది ఫలితాలు విడుదల

By Arun Kumar PFirst Published Feb 13, 2019, 9:06 PM IST
Highlights

వివిధ కారణాలతో గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల తుది ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ (సోషల్ మీడియా తెలుగు మీడియం), గురుకుల టీజిటి పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ విడుదలచేసింది. ఇలా ఒకేరోజు మొత్తంగా 2,528 ఉద్యోగాలకు తుది ఫలితాలను టీఎస్‌పిఎస్సి విడుదల చేసింది. 

వివిధ కారణాలతో గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల తుది ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ (సోషల్ మీడియా తెలుగు మీడియం), గురుకుల టీజిటి పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ విడుదలచేసింది. ఇలా ఒకేరోజు మొత్తంగా 2,528 ఉద్యోగాల తుది ఫలితాలను టీఎస్‌పిఎస్సి విడుదల చేసింది. 

అటవీశాఖలో భారీ సంఖ్యలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు టీఎస్‌పిఎస్సీ 2017 లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇలా 1,823 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడగా అదే సంవత్సరం అక్టోబర్ లో రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం అర్హత సాధించిన అభ్యర్ధులకు శారీరధారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో తుది ఫలితాలు వాయిదాపడుతూ వస్తూ అభ్యర్థుల సహనాన్ని పరీక్షించాయి. అయితే అన్ని ఆటంకాలను దాటుకుంటూ టీఎస్‌పిఎస్సీ ఈ ఉద్యోగాల భర్తీకి తుది ఫలితాలను విడుదల చేసింది. 

అలాగే ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో 699 ఉద్యోగాలు, గురుకులాల్లో 52 టీజీటీ సైన్స్ పోస్టులక భర్తీకి కూడా తుది ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్‌పిఎస్సీ  ఒకేరోజులో ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి తుది ఫలితాలు వెల్లడించడంపై నిరుద్యోగులు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా పెండింగ్ లో వున్న మిగతా ఉద్యోగాల ఫలితాలు, నియామకాలు కూడా త్వరగా జరిగేలా చూడాలని నిరుద్యోగులు టీఎస్‌పిఎస్సీ ని కోరారు.  

click me!