ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగానికి చెందిన 2వేల గ్రూప్ సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఏదైనా గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత పొందిన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు.
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగానికి చెందిన 2వేల గ్రూప్ సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఏదైనా గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత పొందిన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు.
ఈ పోస్టులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9 జనవరి 2021వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.mha.gov.in/లో చూడొచ్చు.
undefined
ముఖ్యమైన సమాచారం:
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐఓ)-గ‌్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్
మొత్తం ఖాళీలు: 2000
కేటగిరీల వారీగా ఖాళీలు: అన్‌రిజర్వ్‌డ్-989, ఈడబ్ల్యూఎస్-113, ఓబీసీ-417, ఎస్సీ-360, ఎస్టీ-121.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం: రాత పరీక్ష(ఆన్‌లైన్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
also read ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు..వెంటనే అప్లయి చేసుకోండీ.. ...
ఐబి ఏసిఐఓ 2020 పరీక్ష ఫీజు: రూ .100
రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు: రూ .500
జనరల్, ఇడబ్ల్యుఎస్, ఓబిసి వర్గాల పురుష అభ్యర్థులు పరీక్ష ఫీజు + రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలి.
ఎస్సీ / ఎస్టీ, మహిళా అభ్యర్థులు & ఎక్స్ఎస్ఎమ్ వారు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించాలి.
పరీక్షా కేంద్రాలు:
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ఆంధ్రప్రదేశ్: గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
అభ్యర్థులు గరిష్ఠంగా మూడు పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 09 జనవరి 2021.
అధికారిక వెబ్‌సైట్:https://www.mha.gov.in/